G20 Summit: దేశాధినేతలకు రాష్ట్ర భోజనం

న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం దీనికి వేదిక. జీ20లో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తోన్నారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయెల్ మక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమాఫోసా.. ఇలా పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతోపన్యాసం చేశారు.

 G20 Summit

కాగా- ఈ సమావేశంలో పాల్గొనడానికి శుక్రవారమే జో బైడెన్ భారత్‌కు వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొన్నారు. జీఈ జెట్ ఇంజిన్లు, న్యూక్లియర్ టెక్నాలజీ వంటి అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. పరిశోధన రంగంలో భారత్‌లోని పలు ఐఐటీలతో అమెరికన్ యూనివర్శిటీలు కలిసి పని చేయడం వంటి అంశాలతో కూడిన ప్రతిపాదనలపై సంతకాలు చేశారు.

ఈ సదస్సుకు హాజరైన వివిధ దేశాధినేతలు, ప్రధానమంత్రులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రత్యేకంగా విందును ఏర్పాటు చేశారు. జో బైడెన్, లి కియాంగ్, రిషి సునాక్ దంపతులు, యూరోపియన్ యూనియన్ ఛైర్ పర్సన్ ఉర్సులా వాన్‌డెర్ లెయెన్ దంపతులు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఛార్లెస్ మైఖెల్ దంపతులు, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథొని అల్బనీస్ హాజరయ్యారు.

ఈ విందులో పలు రకాల వంటకాలను సిద్ధం చేశారు. స్టార్టప్స్‌గా ఫాక్స్‌టెయిల్ మిల్లెట్ లీఫ్ యోగార్ట్, స్పైస్డ్ చట్నీ, పాలు, చిరు ధాన్యాలను ఉంచారు. జాక్ ఫ్రూట్, ఫారెస్ట్ మష్రూమ్, లిటిల్ మిల్లెట్ క్రిస్ప్ అండ్ కర్రీ లీఫ్ టాస్డ్ కేరళ రెడ్ రైస్, ఆనియన్ సీడ్ ఫ్లేవర్డ్ సాఫ్ట్ బన్, కార్డమామ్ ఫ్లేవర్డ్ స్వీట్ ఫ్లాట్ బ్రెడ్, కార్డమాన్ సెంటెడ్ బర్న్‌యార్డ్ మిల్లెట్ పుడ్డింగ్స్.. భోజనంలో వడ్డించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+