మోడీ హత్యకు గడ్కరీ కుట్రంటూ జేఎన్‌యూ విద్యార్థిని ట్వీట్: కేంద్రమంత్రి హెచ్చరిక
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ/ఆర్ఎస్ఎస్ కుట్ర చేస్తోందంటూ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్‌యూ) విద్యార్థిని సెహ్లా రషీద్ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది.

Looks like RSS/Gadkari is planning to assassinate Modi, and then blame it upon Muslims/Communists and then lynch Muslims #RajivGandhiStyle
— Shehla Rashid (@Shehla_Rashid) June 9, 2018
'పరిస్థితులు చూస్తుంటే మోడీని హత్య చేసేందుకు ఆరెస్సెస్/గడ్కరీ ప్రణాళిక వేశారనిపిస్తోంది. ఆపై ముస్లింలను, కమ్యూనిస్టులపై ఆ అభాండం నెట్టేసి వారిని కూడా ఊచకోత కోస్తారేమో!.. #RajivGandhiStyle' అంటూ షెహ్లా రషీద్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌ను పలువురు రీట్వీట్ చేశారు.
I would be taking legal action on anti-social elements who have made bizzare comments; attributing personal motives to me, regarding the assassination threat to PM @narendramodi
— Nitin Gadkari (@nitin_gadkari) June 9, 2018
కాగా, షెహ్లా రషీద్‌ను ప్రస్తావించకుండా సదరు పోస్టుపై నితిన్ గడ్కరీ ఘాటుగా స్పందించారు. 'ఇలా వికృతమైన వ్యాఖ్యలతో చెలరేగే ఆరాచక శక్తులను ఉపేక్షిస్తే మంచిది కాదు. వారిపై న్యాయపరమైన చర్యలకు సిద్ధమవుతున్నా' అంటూ ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications