బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి దీపావళి సంబరాలు, మూడు రోజులు చాన్స్, ఏడు ఏళ్ల తరువాత !

బళ్లారిలో గాలి జనార్దన్ రెడ్డి దీపావళి సంబరాలుఫేస్ బుక్ లో ఫోటోలు పోస్టు చేసిన మాజీ మంత్రిమూడు రోజులు అనుమతి ఇచ్చిన సుప్రీం కోర్టు, ఏడు ఏళ్ల తరువాత !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులతో కలిసి దీపావళి పండుగ వేడుకలు జరుపుకుంటున్నారు. మూడు రోజుల పాటు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో ఉండటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

అక్రమ మైనింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డికి న్యాయస్థానం షరతులతో కూడిన జామీను మంజూరు చేసింది. బళ్లారిలో అడుగు పెట్టకూడదని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. బళ్లారిలో దీపావళి పండుగ జరుపుకోవడానికి అనుమతి ఇవ్వాలని గాలి జనార్దన్ రెడ్డి సుప్రీం కోర్టులో మనవి చేశారు.

Gali Janardhan Reddy celebrates Deepavali at Ballari in Karnataka

ఈనెల 19వ తేదీ నుంచి 21వ తేదీ వరకు గాలి జనార్దన్ రెడ్డి బళ్లారిలో ఉండటానికి సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. బళ్లారి వెళ్లిన గాలి జనార్దన్ రెడ్డి దీపావళి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్బంగా గాలి జనార్దన్ రెడ్డి ఫేస్ బుక్ లో ఆయన అభిమానులు, కర్ణాటక ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

మీకుటుంబాల్లో ఈ దీపావళి పండుగ వెలుగు నింపాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఏడు ఏళ్ల తరువాత బళ్లారిలో తాను కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి దీపావళి పండుగ జరుపుకోవడం చాల సంతోషంగా ఉందని, రాష్ట్ర ప్రజలు ఇక ముందు ప్రతి దీపావళి పండుగ సంతోషంగా గడుపుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు.

English summary
Karnataka former minister Janardhana Reddy has celebrated deepavli at Ballari. Supreme Court of India allowed him to visit Ballari for three days.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X