గాలి జనార్దన్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పిన ఎన్నికల కమీషన్, మీ పార్టీ గుర్తు ఇదే బ్రదర్ !

బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి (కేఆర్ పీ) పార్టీని స్థాపించిన విషయం తెలిసిందే. ఇప్పటికే అనేక అసెంబ్లీ నియోజక వర్గాల్లో గాలి జనార్దన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు సర్వం సిద్దం చేసుకున్నారు.

2022 డిసెంబర్ 25వ తేదీన గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ పెట్టి బీజేపీకి గుడ్ బై చెప్పేశారు. ఇన్ని నెలలు గాలి జనార్దన్ రెడ్డికి ఎన్నికల కమీషన్ పార్టీ గుర్తు కేటాయించలేదు. అయితే సోమవారం భారత ఎన్నికల కమీషన్ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డికి గుడ్ న్యూస్ చెప్పింది. కేఆర్ పీ పార్టీకి ఎన్నికల చిహ్నం కేటాయించడంతో ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి మంచి జోప్ మీద ఉన్నారు.

Gali Janardhan Reddy new political party was assigned the football symbol by the Election Commission

గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీ గుర్తుగా 'ఫుట్ బాల్ ' సింబల్ కేటాయిస్తూ భారత ఎన్నికల కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల్లో ఫుట్ బాల్ గుర్తు ఉపయోగించడానికి అధికారికంగా గాలి జనార్దన్ రెడ్డికి అన్ని హక్కులు చిక్కాయి. సోమవారం తమ పార్టీకి ఎన్నికల చిహ్నంగా ఫుట్ బాల్ గుర్తు కేటాయించడంతో బళ్లారితో పాటు ఉత్తర కర్ణాటకలోని పలు జిల్లాల్లో ఫుట్ బాల్ గుర్తుకే మన ఓటు అంటూ గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు ఫెక్ల్సీలు, బ్యానర్లు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

త్వరలో కర్ణాటకలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఫుట్ బాల్ గుర్తు నుంచి పోటీ చేస్తున్నారు. కోప్పళ జిల్లాలోని గంగావతి నియోజక వర్గం నుంచి గాలి జనార్దన్ రెడ్డి పోటీ చేస్తున్నారు. బళ్లారి సిటీ నుంచి తన భార్య లక్ష్మీ అరుణ పోటీ చేస్తారని ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి ప్రకటించారు.

Gali Janardhan Reddy new political party was assigned the football symbol by the Election Commission
అయితే అందరికి తెలిసిన ఫుట్ బాల్ గుర్తు కేఆర్ పీ పార్టీకి కేటాయించడంతో గాలి జనార్దన్ రెడ్డితో పాటు ఆయన మద్దతుదారులు హ్యాపీగా ఉన్నారని తెలిసింది. అయితే చాలా మంది బీజేపీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డితో టచ్ లో ఉన్నారని సమాచారం, బీజేపీ తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తరువాత పార్టీ టిక్కెట్లు దక్కని ఆ పార్టీ నాయకులు గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉన్నారని తెలిసింది.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+