అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Reddy: గాలి జనార్దన్ రెడ్డి పార్టీ పోటీ చేస్తున్న నియోజక వర్గాలు ఇవే, వార్ వన్ సైడ్ ? లేక ?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు/బళ్లారి: మైనింగ్ కింగ్, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. తాను ఎవరినో ఓడించడానికి కొత్త రాజకీయ పార్టీ పెట్టలేదని, తనను నమ్ముకున్న వారు, తన వెంట ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా గెలిపించుకోవానికే ఎక్కువ ప్రదాన్యత ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తాను ఎవరినీ విమర్శించను, తనను ఎవరైనా విమర్శించినా నేను పట్టించుకోనని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. కొన్ని నెలల్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ తరపున అభ్యర్థులు ఎక్కడెక్కడి నుంచి పోటీ చేస్తారు అనే విషయంలో మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి క్లారిటీ ఇచ్చేశారు.

Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !Wife: ఫామ్ హౌస్ లో భార్య మిడ్ నైట్ మసాల, అర్దరాత్రి అనుకోకుండా వెళ్లిన భర్త ?, అస్తిపంజరం ఎవరిది ?, క్లోజ్ !

 ఒకరితో నాకేంపని..... నా పనినాది

ఒకరితో నాకేంపని..... నా పనినాది

బీజేపీ గుడ్ బై చెప్పిన కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కల్యాణ రాజ్య ప్రగతి అనే కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించారు, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ వ్యవస్థాపకుడు జనార్దన రెడ్డి మాట్లాడుతూ తాను ఎవరినీ ఓడించేందుకు మా పార్టీ అభ్యర్థులను అసెంబ్లీ ఎన్నికల్లో నిలబెట్టటం లేదని, మా పార్టీ అభ్యర్థులను గెలిపించడమే మా ధ్యేయం అని కుండలు బద్దలు కొట్టినట్లు ఒక్కమాటలో చెప్పేశారు. కర్ణాటకలోని కొప్పళ జిల్లాలోని గంగావతిలో శుక్రవారం గాలి జనార్దన్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బీజేపీ నాయకులకు పరోక్షంగా ఝలక్ ఇచ్చారు.

 కౌంటర్ ఎందుకు ఇవ్వాలి ?

కౌంటర్ ఎందుకు ఇవ్వాలి ?

ఎక్కడ నుంచి అయినా తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తే మా అక్కడికి వెళ్లి మా అభ్యర్థులను గెలిపించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తానని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. నేను ఎవరిని విమర్శించను, తనను ఎవరైనా విమర్శించినా పెద్దగా పట్టించుకోను, తాను ఎవరి మాటలకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదని, నా పని నేను చేసుకుంటానని మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి కొందరికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

 మూడు పార్టీలకు పోటీగా గాలి జనార్దన్ రెడ్డి

మూడు పార్టీలకు పోటీగా గాలి జనార్దన్ రెడ్డి

బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టి బీజేపీ నేతలకు పెద్ద ఇబ్బందిగా తయారైనాడని పలువురు రాజకీయ నాయకులు అంటున్నారు. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ ఫిరాయింపులు జోరందుకుంటున్నాయి. మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా మూడు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్) కూడా భారీగా సన్నాహాలు చేసుకున్నాయి. ఏ నియోజకవర్గానికి ఎవరిని అభ్యర్థిగా నిలపాలి అని ఇప్పటి నుంచే వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మూడు పార్టీలకు పోటీగా మాజీ మంత్రి గాలి జానార్దన్ రెడ్డి పలు నియోజక వర్గాల్లో ఆయన పార్టీ అభ్యర్థుల ఎంపికలో బిజీ అయిపోతున్నారు.

 గాలి జనార్దన్ రెడ్డి అభ్యర్థులు రెఢీ ?

గాలి జనార్దన్ రెడ్డి అభ్యర్థులు రెఢీ ?

కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ నుంచి పోటీ చేసేవారంతా కొత్త అభ్యర్థులేని గాలి జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పటికీ మా పార్టీలో చరిష్మా ఉన్న అభ్యర్థులు ఉన్నారని, మంచి పేరు ఉన్నవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నామని గాలి జనార్దన్ రెడ్డి వివరించారు. బళ్లారి. కోప్పాళ, రాయచూర్, విజయనగరం, బళ్లారి గ్రామీణ, యాదగిరి, కలబురగి, విజయపుర, బెంగళూరు సిటీ, బెంగళూరు రూరల్, చిత్రదుర్గ తదితర జిల్లాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని గాలి జానర్దన్ రెడ్డి వివరించారు.

 బళ్లారిలో కౌంట్ డౌన్ మొదలుపెట్టిన రెడ్డి

బళ్లారిలో కౌంట్ డౌన్ మొదలుపెట్టిన రెడ్డి

బీజేపీ నేత, బళ్లారి జిల్లా లింగాయత్ సంఘం నాయకుడు గోనాలు రాజశేఖరగౌడ్ మాజీ మంత్రి జానారెడ్డి కొత్త కల్యాణ్ రాజ్య ప్రగతి పార్టీలో చేరారు. గాలి జనార్దన్ రెడ్డి అతని పార్టీలోని బీజేపీ నాయకులను బళ్లారి నుంచి ఆహ్వానించి ఆయన పార్టీలో చేర్చుకుని బీజేపీ నాయకులకు మొదటి షాక్ ఇచ్చారు. బీజేపీతో పాటు ఇతర పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు గాలి జనార్దన్ రెడ్డి కొత్త రాజకీయ పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్నారని, సమయంలో చూసి గాలి జనార్దన్ రెడ్డి గూటికి చేరిపోతారని తెలిసింది.

English summary
Gali Janardhan Reddy's new political party is contesting in how many districts?, Reddy started the countdown in Bellary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X