గాలి జనార్దన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వాళ్ల ఖర్మకే వదిలేస్తున్నాను, సీఎం జోక్యం చేసుకోవాలి!
కర్ణాటక రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో విమానాశ్రయాలు ఉన్నాయని, అదేవిధంగా బళ్లారిలో విమానాశ్రయం ఉంటే దానికి శ్రీ హనుమాన్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెట్టాలని తనకు ఆశగా ఉందని మైనింగ్ కింగ్, మాజీ మంత్రి, కర్ణాటకలోని గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. బెళగావిలో జరుగుతున్న కర్ణాటక శాసనసభా సమావేశాల్లో గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడారు.
సభను ఉద్దేశించి మాట్లాడిన గంగావతి నియోజక వర్గం ఎమ్మెల్యే గాలి జనార్దన రెడ్డి అయోధ్యలో శ్రీ రామ అంతర్జాతీయ విమానాశ్రయం ఉందని గుర్తు చేశారు. బళ్లారిలో విమానాశ్రయం ఉంటే దానికి శ్రీ హనుమాన్ అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టాలని తనకు ఎంతో ఆశ ఉందని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. నేను మంత్రిగా పని చేసిన రోజుల్లో చేసిన మంచి పనులవల్లే నేడు హుబ్బళిలో విమానాశ్రయానికి ఎయిర్ బస్సులు వస్తున్నాయని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

కర్ణాటకలోని అనేక జిల్లాల్లో తాను అనేక మంచి పనులు చేశానని, దురదృష్టవశాత్తు నేను పుట్టి పెరిగిన బళ్లారిలో ఇప్పటి వరకు విమానాశ్రయం లేదని ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. విజయనగరంలో అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు మీద జూలాజికల్ పార్క్ నిర్మించానని, ఇంగ్లండ్‌లోని లేడీ లిబర్టీ విగ్రహంలా నైట్ సఫారీ, థీమ్ పార్క్, శ్రీకృష్ణదేవరాయల విగ్రహం తయారుచేయాలనే కోరిక ఉండేదని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
తుంగభద్ర నదిలో సౌండ్ అండ్ లైట్ చేయాలనే కోరిక ఉందని, 13 సంవత్సరాల క్రితం తాను ఈ కలలు కన్నానని, ఇప్పటికైన ప్రభుత్వమే ఈ అభివృద్ధి పనులు చేయాలని గాలి జనార్దన్ రెడ్డి మనవి చేశారు. బళ్లారి కోసం ఎవరు ఏం చేశారో నాయకులు వాళ్ల గుండె మీద చేయి వేసి మాట్లాడాలని, రాజకీయాల కోసం వ్యతిరేకించే వారు అలా చేయగలరని, బళ్లారి అభివృద్ధికి గాలి జనార్దనరెడ్డి కృషి చేశారా లేదా అని ఇంటింటికి వెళ్లి దేవుడి ముందు నిలబడి వాళ్లకు వాళ్లు ప్రశ్నించుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.
నేను చెప్పేది తప్పుగా అర్థం చేసుకుంటే అది వాళ్ల కర్మ అంటూ గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. నాపై తప్పుడు కేసులు పెట్టారు, ఆ కేసులు కోర్టు ఉన్నాయని, కేసులకు నేను భయపడనని, న్యాయం గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వం అంజనాద్రి కొండను అభివృద్ధి చేయాలని, బళ్లారిలో అంతర్జాతీయ స్టేడియం నిర్మించాలని గాలి జనార్దన్ రెడ్డి సిద్దరామయ్య ప్రభుత్వానికి మనవి చేశారు.
ఈ అంశంపై ప్రభుత్వం దృష్టి సారించాలని గాలి జనార్దన్ రెడ్డి సిద్దరామయ్య ప్రభుత్వాన్ని కోరారు. బళ్లారిలో మైనింగ్ ట్యాక్స్ ద్వారా రూ 17 వేల కోట్లు వసూలు చేశారని, ఈ సొమ్మును బళ్లారి అభివృద్ధికి వినియోగించాలని కోర్టు ఆదేశించిందని, దీనిపై గనుల యజమానులు 13 ఏళ్లుగా కోర్టులో పోరాడుతున్నారని, ఇప్పుడు ఆ డబ్బు రూ 24 వేల కోట్లు అయ్యిందని, ఈ డబ్బుతో బళ్లారిని అభివృద్ధి చేయాలని గాలి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications