ఆంధ్రాలో జగన్, తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ నేను, గాలి జనార్దన్ రెడ్డి !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలని రెండు జాతీయ పార్టీలు కులం, మతం రాజకీయాలు చేస్తున్నాయని, ఆ రెండు పార్టీలను ఫుట్ బాల్ ఆడినట్లు ఆడుకోవాలని కల్యాణ కర్ణాటక ప్రగతి పార్టీ అధ్యక్షుడు, కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
కర్ణాటకలోని కోప్పళ జిల్లాలోని గంగావతి అసెంబ్లీ నియోజక వర్గం నుంచి మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీ ఫుట్ బాల్ సింబల్ మీద ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. గంగావతిలో జరిగిని కేఆర్ పీపీ సమావేశంలో గాలి జనార్దన్ రెడ్డి మాట్లాడారు. తాను బళ్లారిలో ఉంటే కొందరి ఆటలు సాగవని తాను ఆ జిల్లాలో అడుగుపెట్టకుండా కొందరు నాయకులు చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

తాను బళ్లారి జిల్లాలో ఉంటే తన దెబ్బకు మేము ఓడిపోతామని బావించిన కొందరు నాయకులు తన మీద కుట్రలు చేసి ఆ జిల్లాలో అడుగుపెట్టకుండా చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన కుమార్తె బ్రహ్మిణికి కూతురు పుట్టిన సమయంలో తాను బళ్లారికి వెళ్లానని, ఆ సమయంలో అక్కడికి వచ్చిన సీబీఐ అధికారులు తనతో పాటు తన మనుమరాలి ఫోటోలు తీసుకుని వెళ్లారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.
ఆ సమయంలో నా భార్య లక్ష్మీ అరుణ నువ్వు బతకడానికి బీజేపీ నాయకులు వదిలిపెట్టడం లేదని, నువ్వు మళ్లీ ప్రజల మధ్యలోకి వెళ్లాలంటే కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పిందని, అందుకే తాను బీజేపీ నుంచి బయటకు వచ్చి కల్యాణ కర్ణాటక రాజ్య ప్రగతి పార్టీ (కేఆర్ పీపీ) స్థాపించానని కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

నేను ఎంతో సేవ చేసినా బీజేపీ చివరికి తన జీవితంతో ఆడుకుందని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఎవరు ఎన్ని చేసినా నేను భయపడను, కేఆర్ పీ పార్టీ అంటే ఏమిటో త్వరలోనే చూపిస్తానని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు., తనతో పాటు తన పార్టీ టిక్కెట్ మీద పోటీ చేస్తున్న నాయకులు అందరిని ప్రజలు గెలిపిస్తారని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణలో కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, తమిళనాడులో ప్రాంతీయ పార్టీ డీఎంకే (ఎంకే, స్టాలిన్) ఎలా గెలిచారో అలాగే కర్ణాటకలో కూడా తనతో పాటు కేఆర్ పీ పార్టీ అభ్యర్థులు ఘనవిజయం సాధిస్తారని, అప్పుడు జాతీయ పార్టీలకు తాము సినిమా చూపిస్తామని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
తనకు ఇప్పుడు మంచిరోజులు వచ్చాయి. నీకు మనుమరాలు పుట్టిన తరువాత అంతా మంచి జరుగుతుందని ఓ జ్యోతిష్యుడు చెప్పారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. ఆ జ్యోతిష్యుడి మాట నిజం అవుతోందని, అందుకే తాను డిసెంబర్ లో కేఆర్ పీ పార్టీ స్థాపించానని, గంగావతిలో భారీ మెజారిటీతో తాను విజయం సాధిస్తానని మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications