గాలి జనార్దన్ రెడ్డి గాలం, యడియూరప్ప శిష్యుడు, టాప్ లీడర్ జంప్, గోవిందా గోవింద !
బెంగళూరు/బళ్లారి: కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల వేడి మొదలు కావడంతో అన్ని పార్టీల నాయకులు మంచి ఊపు మీద ఉన్నారు. కర్ణాటకలో అధికారంలో ఉన్న బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తో పాటు జేడీఎస్, గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీ నాయకులు ఎవరి ఊహల్లో వాళ్లు ఉన్నారు. అయితే బీజేపీకి కోరకరాని కొయ్యగా తయారైన గాలి జనార్దన్ రెడ్డి యాక్షన్, కట్ మొదలుపెట్టారు.
కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి బీజేపీకి గుడ్ బై చెప్పి 2022 డిసెంబర్ 25వ తేదీన కల్యాణ ప్రగతి పార్టీ (కేఆర్ పీ) అనే కొత్త రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. కర్ణాటకలో బీజేపీ అధికారంలోకి రావడానికి, బీఎస్ యడియూరప్పను సీఎం చెయ్యడానికి గాలి జనార్దన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేశారు ? అనే విషయం కర్ణాటక రాజకీయాల గురించి తెలిసిన వాళ్లకు కొత్తగా చెప్పనవసరం లేదు.

బీజేపీ నుంచి బయటకు వచ్చిన గాలి జనార్దన్ రెడ్డి అదే బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీల నాయకులను కేఆర్ పీ వైపు లాక్కొంటున్నారు. మాజీ సీఎం బీఎస్. యడియూరప్పకు అత్యంత సన్నిహితుడు, కర్ణాటక బీజేపీ యువమోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడు భీమాశంకర్ గాలి జనార్దన్ రెడ్డి కేఆర్ పీ పార్టీలో చేరడంతో అందరూ బిత్తరపోయారు.
మాజీ సీఎం బీఎస్ యడియూరప్పకు అత్యంత సన్నిహితుడిగా, బెళగావిలో మంచి పవర్ ఫుల్ లీడర్ గా, గతంలో గోవాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా గోవాలో బీజేపీ ఇన్ చార్జ్ గా ఉన్న భీమాశంకర్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి కేఆర్ పీలో చేరిపోయారు. ఆళంద నియోజక వర్గం టిక్కెట్ ఆశిస్తున్న భీమాశంకర్ ఆ నియోజక వర్గం అభ్యర్థి పేరును బీజేపీ ప్రకటించకముందే భీమాశంకర్ బీజేపీని వదిలేయడం హాట్ టాపిక్ అయ్యింది.
మంచి మాస్ లీడర్ గా గుర్తింపు తెచ్చుకుని బీజేపీ యువ మోర్చ రాష్ట్ర ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న భీమాశంకర్ బీజేపీకి గుడ్ బై చెప్పడంతో బెళగావిలో హాట్ టాపిక్ అయ్యింది. మొత్తం మీద బీజేపీలోని అసమ్మతి నాయకులు అందరూ గాలి జనార్దన్ రెడ్డి గూటికి చేరే అవకాశం ఉందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications