సీఎంకు పాము పగ: 12 ఏళ్లకు కసి తీర్చకున్నారు. ఇక చేతులు కట్టుకోను: గాలి జనార్దన్ రెడ్డి!
బెంగళూరు: తన మీద కక్ష పెంచుకున్న ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి 12 సంవత్సరాల పగ తీర్చుకోవడానికి అరెస్టు చేయించారని కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తనను జైలుకు పంపించానని సీఎం కుమారస్వామికి రాక్షసులు పొందే ఆనందం కలిగిందని, అది ఎంతో కాలం ఉండదని, దేవుడు తనవైపు ఉన్నాడని, ఆ విషయం వాళ్లు గుర్తు పెట్టుకోవాలని మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.

కుమారస్వామి కుట్ర
మేము ఎప్పుడు అధికారంలోకి వస్తామా, గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి ఎలా జైలుకు పంపించాలా అంటూ 12 ఏళ్ల నుంచి హెచ్.డి. కుమారస్వామి వేచి చూస్తున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. కుమారస్వామి సీఎం అయిన తరువాత సీసీబీ పోలీసుల మీద ఒత్తిడి చేసి చివరికి తనను అరెస్టు చేసి జైలుకు పంపించి పగ తీర్చుకున్నారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

సీఎం వలనే జైలుకు !
సీఎం కుమారస్వామి కారణంగానే తాను జైలుకు వెళ్లానని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన అరెస్టుకు సీఎం కుమారస్వామి భాద్యుడు అని గాలి జనార్దన్ రెడ్డి నేరుగా ఆరోపించారు. శాసన సభ ఎన్నికలు జరిగే సమయం నుంచి తనను అరెస్టు చెయ్యడానిని ప్రయత్నాలు జరుగుతున్నాయని, తన ఇంటి దగ్గర భయానక వాతవరణం సృష్టించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

రాక్షుసుల ఆనందం
తనను అరెస్టు చేసి జైలుకు పంపించిన సీఎం కుమారస్వామి రాక్షసులు పొందే ఆనందం పొందారని, అది ఎంతోకాలం ఉండదనే విషయం ఆయన గుర్తుపెట్టుకోవాలని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. భగవంతుడు తనవైపు ఉన్నంత వరకు ఇలాంటి కుళ్లు రాజకీయ నాయకులు తనను ఏమీ చెయ్యలేరని గాలి జనార్దన్ రెడ్డి చెప్పారు.

12 ఏళ్ల పాము పగ !
పాము పగ 12 ఏళ్లు ఉంటుందని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. అదే సీఎం కుమారస్వామికి తన మీద పగ 12 ఉందని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. తన మీద ద్వేషం పెంచుకున్న కుమారస్వామి 12 ఏళ్ల క్రితం అధికారం అడ్డంపెట్టుకుని తప్పుడు కేసులు పెట్టి 1, 500 మంది పోలీసులను పంపించి తనను అరెస్టు చెయ్యడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నించి విఫలం అయ్యారని గాలి జనార్దన్ రెడ్డి గుర్తు చేశారు. ఆ పగ, కసి తీర్చుకోవడానికి నేడు తప్పుడు కేసులు పెట్టించి అరెస్టు చేసి జైలుకు పంపించారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు.

స్నేహం కోసం ప్రాణం !
శాసన సభ ఎన్నికల్లో మాళకాల్మూరు నియోజక వర్గం నుంచి పోటీ చేసిన తన స్నేహితుడు శ్రీరాములును గెలిపించడం కోసం అక్కడ తాను ప్రచారం చేశానని, అప్పటి నుంచి తనను అరెస్టు చేయించడానికి ప్రయత్నాలు జరిగాయని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. బెంగళూరులోని తన ఇంటి దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు సంచరించి ఎప్పటికప్పుడు సమాచారం సేకరించారని, మా కుటుంబ సభ్యులకు ఆందోళనకు గురి చేశారని గాలి జనార్దన్ రెడ్డి ఆరోపించారు. ఆ సమయంలో తనకు తెలిసిన కొందరు పోలీసులు మీరు జాగ్రత్తగా ఉండండి అని సూచించారని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు.

ఇక చేతులు కట్టుకోను !
అక్రమ కేసుల్లో తనను అరెస్టు చేసి జైలుకు పంపించి తన కుటుంబ సభ్యులను దూరం చేశారని, రాజకీయంగా తనను అంతం చెయ్యడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇక తాను చేతులు కట్టుకుని కుర్చోనని గాలి జనార్దన్ రెడ్డి ప్రత్యర్థులను హెచ్చరించారు. దేవుడు, న్యాయం తనవైపు ఉన్నంత వరకు వీళ్లు తనను ఏమీ చెయ్యలేరని గాలి జనార్దన్ రెడ్డి అన్నారు. తనను అన్యాయంగా అరెస్టు చేసి జైలుకు పంపించిన సీసీబీ పోలీసులు న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కోర్టులో తలలు దించుకుని నిలబడ్డారని గాలి జనార్దన్ రెడ్డి విమర్శించారు. ఇలాంటి పోలీసులు ఎక్కడా ఉన్నా ప్రజలకు న్యాయం జరగదని గాలి జనార్దన్ రెడ్డి మండిపడ్డారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications