• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా చికిత్సలో కీలక మలుపు? -Monoclonal antibody therapyతో గంటల్లోనే సత్పలితాలు

|

కొవిడ్ చికిత్సకు సంబంధించి ఇప్పటికే ఎన్నెన్నో మార్పులు జరిగాయి. మొదట్లో వాడిన ప్లాస్మా థెరపీ పనికిరాదని, హైడ్రోక్లోరోక్విన్ కూడా పనిచేయదని.. ఇలా నెలకోవిధంగా కేంద్రం, ఐసీఎంఆర్ ప్రకటనలు చేస్తూ వస్తున్నది. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వ్యాక్సిన్ మాత్రమే వజ్రాయుధమనే భావనకు అందరూ వచ్చారు. అయితే, ఢిల్లీ డాక్టర్లు మాత్రం ఓ థెరపీని కొవిడ్ చికిత్సలో గేమ్ ఛేంజర్ గా భావిస్తున్నారు. దాంతో గంటల్లోనే సత్ఫలితాలు వస్తుండటం అందరిలో ఆశలు పెంచుతోంది. వివరాలివి..

  COVID Delta Variant : అల్ఫా కంటే 50 శాతం ఎక్కువగా డెల్టా వేరియంట్ వ్యాప్తి ! || Oneindia Telugu

  మోదీ మెడలు ఇంకా వంచుదాం -ఫ్రీ వ్యాక్సిన్ -ఇక మారటోరియంపై పోరాడుదాం: 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖలుమోదీ మెడలు ఇంకా వంచుదాం -ఫ్రీ వ్యాక్సిన్ -ఇక మారటోరియంపై పోరాడుదాం: 12 మంది సీఎంలకు స్టాలిన్ లేఖలు

  యాంటీబాడీ థెరపీ

  యాంటీబాడీ థెరపీ

  ఇద్దరు కొవిడ్ రోగుల్లో మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో గంటల వ్యవధిలోనే సత్ఫలితాలు వచ్చాయని ఢిల్లీ లోని గంగారామ్ ఆస్పత్రి డాక్టర్లు బుధవారం వెల్లడించారు. 36 ఏళ్ల హెల్త్‌కేర్ వర్కర్ తీవ్రమైన జ్వరం, దగ్గు, కండరాల నొప్పులు, , రక్తంలో తెల్లకణాలు తగ్గుదల (లుకోపేనియా) తదతర లక్షణాలతో గత ఆరు రోజులుగా బాధపడుతుండగా, మంగళవారం మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీతో చికిత్స చేశామని, కేవలం ఎనిమిది గంటల్లోనే సత్ఫలితాలు లభించాయని డాక్టర్ పూజా ఖోస్లా చెప్పారు. ఆమె గంగారామ్ ఆస్పత్రిలో మెడిసిన్ విభాగం సీనియర్ కన్సల్టెంట్‌ గా పనిచేస్తున్నారు. తాము ట్రీట్మెంట్ ఇచ్చిన రోగికి ఐదు రోజుల పాటు తీవ్రమైన జ్వరం వచ్చిందని, రక్తంలో తెల్లకణాల సంఖ్య 2600 కు పడిపోయిందని, యాంటీబాడీ థెరపీతో చికిత్స చేయగానే రోగి పరిస్థితి బాగా మెరుగైందని ఆమె తెలిపారు.

  CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్CJI NV Ramana మరో సంచలనం? -హైకోర్టు జడ్జిలుగా సుప్రీం లాయర్లకు ఎలివేషన్! -ఒకే చెప్పారన్న బార్

  బిఎల్‌కె మాక్స్ ఆస్పత్రిలోనూ..

  బిఎల్‌కె మాక్స్ ఆస్పత్రిలోనూ..

  మరో రోగి 80 ఏళ్ల ఆర్‌కె రాజ్‌దాన్. రాజ్‌దాన్ డయాబెటిస్, అత్యధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. సిటి స్కాన్‌లో కొవిడ్ నెమ్మదిగా వ్యాపిస్తున్నట్టు తేలిందని, అయిదో రోజున ఆయనకు ఈ యాంటీబాడీ థెరపీ చేయగా, 12 గంటల్లోనే సత్ఫలితాలు కనిపించాయి. మోనోక్లోనల్ యాంటీబాడీ థెరపీని సరిగ్గా వినియోగిస్తే అనుకున్న రీతిలో సత్ఫలితాలు వస్తాయని, కొవిడ్ రోగుల్లో ఈ థెరపీ చాలా కీలక పాత్ర వహిస్తుందని డాక్టర్ ఖోస్లా చెప్పారు. బిఎల్‌కె మాక్స్ ఆస్పత్రి డాక్టర్లు మంగళవారం వృద్దులైన ఇద్దరు కరోనా రోగులు గుండె సమస్యలతో బాధపడుతుండగా ఈ యాంటీబాడీ చికిత్స ఇవ్వడంతో వారం తరువాత వారిలో నెగిటివ్ కనిపించిందని తెలిపారు.

  మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టైల్

  మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టైల్

  ఇదే విధంగా ఛాతీ, శ్వాస సమస్యలతో సతమతమౌతున్న ఇద్దరికి కొవిడ్ లక్షణాలు కనిపించిన మూడు రోజుల్లోనే యాంటీబాడీ కాక్‌టైల్ థెరపీ చికిత్స చేయగా వారిలో మెరుగైన ఫలితాలు వచ్చాయని బిఎల్‌కె మాక్స్ సెంటర్ ( ఛాతీ, శ్వాస కోశ సమస్యల విభాగం )సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సందీప్ నాయర్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొవిడ్‌పై పోరులో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్‌టైల్ థెరపీ కీలక పాత్ర వహిస్తుందని నిర్ధారణ అయినట్టు డాక్టర్లు వివరించారు. మోనోక్లోనల్ యాంటీబాడీలంటే అసలైన యాంటీబాడీలను పోలి ఉండే యాంటీబాడీలు. ఇవి నిర్దిష్ట యాంటీజెన్‌ను లక్షంగా చేసుకుని పనిచేస్తాయి. ఈ విధమైన థెరపీ గతంలో ఎబోలా, హెచ్‌ఐవి వైద్యచికిత్సలో ఉపయోగించి సత్ఫలితాలు సాధించారు. కాగా, ప్రస్తుతానికి ఢిల్లీలోని రెండు ఆస్పత్రుల వైద్యులు మాత్రమే నిర్ధారించిన ఈ యాంటీబాడీ థెరపీపై కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్ లు ప్రకటన చేయాల్సిఉంది.

  English summary
  Doctors at Sir Ganga Ram Hospital in New Delhi have successfully treated patients suffering from Covid-19 using monoclonal antibody therapy. The two patients who were administered the REGCov2, designed to produce resistance against the SARS-CoV-2, were discharged within 12 hours of being given the doses. Monoclonal antibodies are identical copies of an antibody that targets one specific antigen. This treatment has previously been used in treating deadly pathogens like Ebola and HIV. The REGCov2 is developed by Regeneron which is conducting the phase-3 Covid-19 prevention trials.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X