లిఫ్ట్ ఇస్తానని నమ్మించి.. ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్

న్యూఢిల్లీ : రైలు దిగి రైల్వే స్టేషన్ బయట అడుగుపెట్టిన ఆ ఇద్దరికీ.. ఇంటికి వెళ్లేందుకు వాహనాలేవి కనిపించలేదు. ఇంతలో ఓ వ్యక్తి వచ్చి లిఫ్ట్ ఇస్తానన్నాడు. రాత్రి సమయం.. పైగా రోడ్డుపై ఇద్దరే ఉన్నారు. దీంతో అతగాడి మాటలు నమ్మిన వెళ్లిన ఆ ఇద్దరు మహిళలను తీవ్రంగా వంచించాడు సదరు వాహనదారుడు. తనే గాక మరో నలుగురు వ్యక్తులతో కలిసి ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డాడు.

జైపూర్ లోని రామ్ గంగామండీలో ఈ గ్యాంగ్ రేప్ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్ కు చెందిన ఇద్దరు మహిళలు రాత్రి సమయంలో రామ్ గంగామండి రైల్వే స్టేషన్ లో దిగారు. అక్కడి నుంచి బంధవుల ఇంటికి వెళ్లాల్సిన ఆ ఇద్దరు.. స్టేషన్ బయటకొచ్చి టాక్సీ ఏమైనా దొరుకుతుందేమోనని ఎదురుచూడడం మొదలుపెట్టారు.

 Gang Rape on two woman in Jaipur

ఇంతలో అక్కడకు వచ్చిన రాజేంద్ర సొసోడియా అనే వ్యక్తి ఇద్దరికీ లిఫ్ట్ ఆఫర్ చేశాడు. దీంతో అతగాడి మాటలు నమ్మి ఇద్దరు అతనితో బయలుదేరారు. ఇదే క్రమంలో కోట జిల్లాలోని సుకైత్ ప్రాంతంలో ఉన్న వ్యవసాయ క్షేత్రం వద్దకు చేరుకోగానే.. మహిళలిద్దరిని ఓ గదిలో బంధించాడు నిందితుడు రాజేంద్ర సిసోడియా.

అనంతరం తన నలుగురు స్నేహితులకు ఫోన్ చేసి వాళ్లను రావాల్సిందిగా కోరాడు. దీంతో రాత్రంతా ఆ ఐదుగురు నిందితులు పలుమార్లు మహిళలపై అత్యాచారం చేశారు. ఆపై.. ఇద్దరిని మళ్లీ రామ్ గంగామండీ రైల్వే స్టేషన్ వద్ద వదిలేసి వెళ్లారు నిందితులు. అనంతరం అక్కడినుంచి పోలీస్ స్టేషన్ కు వెళ్లి విషయంపై ఫిర్యాదు చేశారు మహిళలిద్దరు.

మాజీ డిప్యూటీ ప్రధాన్ గా పనిచేసిన రాజేంద్ర సింగ్ సిసోడియాతోపాటు రోదు సింగ్ సిసోడియా, శివధాకడ్ మరో ఇద్దరు కలిసి తమపై అత్యాచారం చేశారని బాధితురాళ్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సెక్షన్ 376కింద కేసు నమోదు చేసి మహిళలిద్దరిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లుగా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+