వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కారులో విద్యార్థినిపై గ్యాంగ్ రేప్, ప్రధాని మోడీకే లేఖ రాసింది, జ్యూస్ లో మత్తు మందు కలిపి !

నా మీద సామూహిక అత్యాచారం చేశారు, మీరు న్యాయం చెయ్యండి అంటూ ఓ విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసి సంచలనం సృష్టించింది. తనకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకూడదని బాధితురాలు ప్రధాని నరే

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: నా మీద సామూహిక అత్యాచారం చేశారు, మీరు న్యాయం చెయ్యండి అంటూ ఓ విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాసి సంచలనం సృష్టించింది. తనకు జరిగిన అన్యాయం మరే అమ్మాయికి జరగకూడదని బాధితురాలు ప్రధాని నరేంద్ర మోడీకి మనవి చేసింది.

కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !కుమార్తెను కుర్చీలో కట్టేసి పక్కింటి ఆంటీని రేప్ చేశాడు, చివరికి కామాంధుడు !

కర్ణాటకలోని బాగల్ కోటే జిల్లాలోని శిరూరులోని సిద్దేశ్వర ప్రౌడశాలలో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థిని ప్రధాని నరేంద్ర మోడీతో సహ కేంద్ర మంత్రి మేనకా గాంధీ, కర్ణాటక మహిళా కమిషన్, బాగల్ కోటే జిల్లా కలెక్టర్, జిల్లా పోలీసు కమిషనర్, జిల్లా పంచాయితీ సీఈవో, కర్ణాటక విద్యాశాఖ అధికారులకు లేఖ రాయడంతో ఒక్క సారిగా భారతదేశం ఉలిక్కిపడింది.

నాది తక్కువ కులం !

నాది తక్కువ కులం !

కన్నడలో ప్రధాని మోడీకి బాధితురాలు రాసిన లేఖలోని పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నేను దళిత వర్గానికి చెందిన బాలిక. సిద్దేశ్వర పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తన్నాను. అదే స్కూల్ లో ఉద్యోగం చేస్తున్న విజయకుమార్ తనతో మాట్లాడాడు.

ఎస్సీ, ఎస్టీ స్కాలర్ షిప్ !

ఎస్సీ, ఎస్టీ స్కాలర్ షిప్ !

ప్రభుత్వం నుంచి మీకు వచ్చే ఎస్సీ, ఎస్టీ స్కాలర్ షిప్ ఇప్పిస్తానని తనను విజయకుమార్ నమ్మించాడని బాలిక వివరించింది. దళితులైన మేము ప్రభుత్వం ఇచ్చే స్కాలర్ షిప్ తీసుకోవడానికి సిద్దం అయ్యామని బాలిక గుర్తు చేసింది.

అతన్ని నమ్మి కారులో వెళ్లాను !

అతన్ని నమ్మి కారులో వెళ్లాను !

జిల్లా కేంద్రం బాగల్ కోటేలోని విద్యాశాఖ కార్యాలయంలో స్కాలర్ షిప్ ఇప్పిస్తామని విజయకుమార్ నమ్మించడంతో కారులో అతనితో కలిసి తాను వెళ్లానని బాలిక అంటోంది. అదే కారులో విజయ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు బాగల్ కోటే బయలుదేరారని బాలిక వివరించింది.

 జ్యూస్ లో మత్తుమందు, కారులోనే

జ్యూస్ లో మత్తుమందు, కారులోనే

తనకు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇవ్వడంతో తాగానని, స్పృహకోల్పోయిన తరువాత తన మీద విజయకుమార్ తో సహ మరో ముగ్గురు సామూహిక అత్యాచారం చేశారని బాధితురాలు ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్లింది.

విశ్రాంతి ఇవ్వకుండా అనుభవించారు !

విశ్రాంతి ఇవ్వకుండా అనుభవించారు !


కారులో తనకు విశ్రాంతి కూడా ఇవ్వకుండా సాయంత్రం వరకు తనను అనుభవించారని, తరువాత విషయం బయటకు తెలిస్తే ప్రాణాలు తీస్తామని హెచ్చరించి ఇంటి దగ్గర వదిలి వెళ్లిపోయారని బాధితురాలు తన గోడును వెల్లబోసింది.

జ్వరం వస్తే ఆసుపత్రికి !

జ్వరం వస్తే ఆసుపత్రికి !

తనకు నిత్యం జ్వరం రావడంతో మా అమ్మ ఆసుపత్రికి పిలుచుకుని వెళ్లిందని, వైద్యులు తన మీద అత్యాచారం జరిగిందని నిర్ధారించారని బాధితురాలు వాపోయింది. పరువు పోతోందని మా తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చెయ్యడానికి భయపడ్డారని భాధితురాలు గుర్తు చేసింది.

చాల మందికి అన్యాయం !

చాల మందికి అన్యాయం !

మా స్కూల్ చదువుతున్న చాల మంది అమ్మాయిలకు స్కాలర్ షిప్ ఇప్పిస్తానని విజయకుమార్ ఇలానే అత్యాచారం చేశాడని, ఆ నిందితుడితో పాటు కామాంధులను శిక్షించి మాకు న్యాయం చెయ్యాలని దళిత బాలిక ప్రధానితో పాటు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసింది.

కామాంధులు పరుగో పరుగు !

కామాంధులు పరుగో పరుగు !

దళిత బాలిక ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేసిందని తెలుసుకున్న కామాంధుడు విజయ్ కుమార్ తో పాటు మరో ముగ్గురు నిందితులు పరారైనారని సమాచారం. విషయం తెలుసుకున్న అధికారులు బాలిక ఇంటికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

మోడీ, మేనకా గాంధీ ?

మోడీ, మేనకా గాంధీ ?


కర్ణాటకకు చెందిన దళిత బాలిక రాసిన లేఖపై ప్రధాని కార్యాలయం, కేంద్ర మంత్రి మేనకా గాంధీ, కర్ణాటక మానవ హక్కుల కమిషన్ స్పందించాల్సి ఉంది. శిరూరులోని సిద్దేశ్వర ప్రౌడ శాల చేరుకుని అక్కడ చదువుతున్న విద్యార్థినులను విచారిస్తే కామాంధుడు విజయకుమార్ గురించి మరన్ని వివరాలు వెలుగు చూసే అవకాశం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

English summary
A Dailt girl from Bagalkot (Karnataka) has now poured her predicaments in a letter to Prime Minister Narendra Modi, seeking justice after she was raped by her school peon and three of his accomplices three months ago.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X