గ్యాంగ్ వార్: సినిమా తరహాలోనే కోర్టులోనే కాల్పులు వ్యక్తి మృతి, పారిపోతూ....

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ: అచ్చు సినిమాను తలపించే ఘటన ఒకటి న్యూఢిల్లీలోని రోహిణి కోర్టులో చోటుచేసుకొంది. సినిమాల్లో చూపినట్టుగానే రెండు గ్యాంగుల మధ్య ఏ రకంగా జరుగుతుందో అదే తరహా ఘటన చోటుచేసుకొంది.విచారణ ఖైదీపై ఓ కిరాయి హంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో విచారణలో ఉన్న ఖైదీ అక్కడికక్కడే మరణించాడు.

న్యాయస్థానంలోనే గ్యాంగ్ వార్ జరిగింది. కోర్టు ప్రాంగంణంలోనే అండర్ ట్రయల్ ఖైదీపై ప్రత్యర్థి గ్యాంగ్ దాడికి పాల్పడింది. రాజేశ్ దుర్ముత్ అనే అండర్ ట్రయల్ ఖైదీని హార్యానా పోలీసులు కోర్టుకు తీసుకువస్తుండగా ఈ ఘటన చోటుచేసుకొంది.

firing

పెద్ద సమూహంలో నుండి దూసుకువచ్చిన మోహిత్ అనే వ్యక్తి నాటు తుపాకితో కాల్పులు జరిపాడు. దీంతో బుల్లెట్టు అతడి భుజంలోకి , గుండెలోకి దూసుకెళ్ళాయి. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. కాల్పులు జరిపిన కిరాయి హంతకుడు అంతటితో ఆగకుండా మరో తుపాకీ తీసి పోలీసులపై కాల్పులకు ప్రయత్నించాడు.

అయితే ఆ తుపాకీ పేలలేదు. దీంతో అతడు పారిపోయేందుకు ప్రయత్నించి చివరికి దొరికిపోయాడు. బాధితుడు దుర్ముత్ నీతు దాబోడియా గ్యాంగ్ లో సభ్యుడు. ఇతడిపై 16 దొంగతనం, హత్యలు , దోచుకోవడం లాంటి కేసులున్నాయి. రెండు రోజుల ముందే మోహిత్ ప్లాన్ చేసుకొని పోలీసుల వాహనాన్ని అనుసరించి ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసుల విచారణలో తేలింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A hired shooter killed an undertrial on the Rohini court premises on Saturday morning.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి