బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎడిటర్ గౌరి లంకేష్: నివేదిక అడిగిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీబీఐ విచారణ !

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ హత్య కేసును ఎస్ఐటీ అప్పగిస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య బుధవారం ఆదేశాలు జారీ చేశారు. గౌరి లంకేష్ హత్య ఎలాగి జరిగింది, దర్యాప్తు వివరాలు ఏమిటి అని ఆరా తియ్యాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సూచించారు.

కన్నడ ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: సీసీకెమెరాల్లో, ప్రత్యక్ష సాక్షులు లేరు: డీజీపీ దత్త !కన్నడ ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: సీసీకెమెరాల్లో, ప్రత్యక్ష సాక్షులు లేరు: డీజీపీ దత్త !

కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరి లంకేష్ హత్య కేసు నివేదిక తెప్పించాలని కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర హోం శాఖ కార్యాలయం నివేదిక ఇవ్వాలని బుధవారం కర్ణాటక ప్రభుత్వానికి సూచించింది. గౌరి లంకేష్ హత్య కేసు సీబీఐకి అప్పగించే అవకాశం ఉందని సమాచారం.

ఎడిటర్ గౌరి లంకేష్: నివేదిక అడిగిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, సీబీఐ విచారణ !

గౌరి లంకేష్ హత్య కేసును సీబీఐకి అప్పగించాలని ఆమె సోదరుడు, దర్శక నిర్మాత ఇంద్రజిత్ లంకేష్, కేంద్ర మంత్రి సదానంద గౌడ డిమాండ్ చేశారు. అయితే గౌరి లంకేష్ హత్య కేసును ఎస్ఐటీకి అప్పగిస్తామని, నివేదిక వచ్చిన తరువాత ఈ విషయంపై ఆలోచిస్తామని సీఎం సిద్దరామయ్య అంటున్నారు.

బెంగళూరులో ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: పోలీసుల అదుపులో హంతకుడు అశోక్ !బెంగళూరులో ఎడిటర్ గౌరి లంకేష్ హత్య: పోలీసుల అదుపులో హంతకుడు అశోక్ !

గౌరి లంకేష్ ను అతిసమీపం నుంచి రివాల్వర్ తో కాల్చి చంపడంతో పక్కా ప్లాన్ ప్రకారం హత్య జరిగిందని పోలీసు అధికారులు అంటున్నారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ఎస్ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గౌరి లంకేష్ హత్య కేసు దర్యాప్తు ఇప్పుడు ఎస్ఐటీ అధికారులకు సవాలుగా మారింది.

English summary
Gauri Lankesh murder case Home Ministry seeks report,The Union Home Ministry on Wednesday sought a detailed report from the Karnataka government on Kannada journalist and editor of Lankesh Patrike Gauri Lankesh murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X