బెంగళూరు గౌరీ లంకేష్ హత్య, సనాతన కార్యాలయంలో సిట్ సోదాలు, రౌడీషీటర్లు చర్చ !

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగళూరు: కన్నడ లంకేష్ పత్రిక ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య కేసు విచారణ చేస్తున్న ప్రత్యే దర్యాప్తు టీం(సిట్) అధికారులు బెంగళూరులోని సనాతన సమసత్ కార్యాలయాల్లో సోదాలు చేసి అనేక కీలకమైన పత్రాలు స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు.

బెంగళూరులో గౌరీ లంకేష్ హత్య: స్కాట్లాండ్ పోలీసుల సహకారం, ఆరితేరిన అధికారులు !

సనాతన సంస్థ కార్యాలయాల్లో సిట్ అధికారులు సోదాలు చేశారు. ఈ సందర్బంగా సిట్ అధికారులు మాట్లాడుతూ గౌరీ లంకేష్ హత్య కేసు వివిధ కోణాల్లో విచారణ చేస్తున్నామని, అందులో భాగంగానే సనాతన కార్యాలయాల్లో సోదాలు చేశామని వివరణ ఇచ్చారు.

Gauri Lankesh murder case offices belong to Sanathana Samsthe raided by SIT
  ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు వీరే

  ప్రోఫసర్ ఎంఎం కులబరిగి, గౌరీ లంకేష్ ను ఒకే విధంగా హత్య చెయ్యడం, ఒకే రకమైన పిస్తోల్ ఉపయోగించడంతో రెండు హత్యలు ఒక్కరే చేసి ఉంటారని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గౌరీ లంకేష్ హత్యపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేరళ సీఎం పినరయి విజయన్ సైతం కొచ్చిలో గౌరీ లంకేష్ నివాళులు అర్పించి ఆమెను హత్య చేసిన హంతకులను వెంటనే అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు.

  కన్నడ ఎడిటర్ గౌరీ లంకేష్ హత్య: తల్లిదండ్రులతో కలిసి వచ్చిన కుణిగల్ గిరి, తెలీదు !

  గౌరీ లంకేష్ హత్య విషయంలో ఇద్దరు రౌడీషీటర్లు ఫోన్ లో మాట్లాడుకున్నారని సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రౌడీషీటర్ పాయిసన్ రామ ముఖ్య అనుచరుడు మాయం కావడంతో అతని కోసం సిట్ అధికారులు గాలిస్తున్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  The special investigating team which is investigating Gauri Lankesh's murder case has raided two offices of Sanathana Samsthe in Bengaluru on 15th September 2017.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి