కుంభమేళా నుంచి స్ఫూర్తిపొందిన అదానీ-రేపటి నాయకత్వానికి నేటి పాఠంగా..!

ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భారీ ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. ఇప్పటివరకూ 12 కోట్ల మందికి పైగా భక్తులు ఇక్కడికి వచ్చి పుణ్నస్నానాలు ఆచరించారు. ఇందులో ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు, సాధారణ భక్తులు ఉన్నారు. అయితే వీరిలో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతం అదానీ మాత్రం దీన్ని కేవలం ఓ పుణ్యం సంపాదించుకునే అవకాశంగా చూడలేదట, రేపటి నాయకులకు ఆధ్యాత్మిక మౌలిక సదుపాయంగా దీని నుంచి స్ఫూర్తి పొందినట్లు ఆయన తాజాగా లింక్డ్ ఇన్ పోస్టులో తెలిపారు.

కుంభమేళాతో తన అనుబంధాన్ని, దీని వల్ల దేశానికి కలుగుతున్న మేలును, తనకు లభించిన స్ఫూర్తిని లింక్డ్ ఇన్ లో పెట్టిన పోస్టులో గౌతం అదానీ పంచుకున్నారు. ఇందులో కుంభమేళా నిర్వహణలో భారతదేశ పూర్వీకుల జ్ఞానం, దార్శనికత తనను తాకిందని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలకంగా ఉన్న అదానీ.. కుంభమేళాను ప్రపంచంలోనే అతి పెద్ద మేనేజ్ మెంట్ కేస్ స్టడీగా అభివర్ణించారు. ఈవెంట్‌ను "పాప్-అప్ మెగాసిటీ"గా అభివర్ణించారు.
ఇందులో కార్పోరేట్ సమావేశాలు లేవని, ప్రదర్శనలు, ఆర్ధిక పెట్టుబడులు లేవని, కానీ శతాబ్దాల భారతీయ ఆవిష్కరణ ఉందన్నారు. కుంభమేళా అనేది మూడు నాయకత్వ లక్షణాల పునాదిగా అభివర్ణించారు.

Gautam Adani describes kumbh mela as spiritual infrastructure drawn inspiration for leadership

ఆత్మల సంగమం..

కుంభమేళాలో లక్షలాది మంది గుమిగూడడం కేవలం ఒక ఈవెంట్ మాత్రమే కాదని, అది ఆత్మల సంగమం అని అదానీ తెలిపారు. నిజమైన స్కేల్ సంఖ్యల ద్వారా కొలవబడదని, అది మానవాళిపై చూపే ప్రభావంతో అని అదానీ తెలిపారు. విభిన్న సమూహాలను ఏకీకృతం చేయడం,, లోతైన మానవ క్షణాలను సృష్టించడం వంటి కుంభమేళా సామర్థ్యం సాంప్రదాయ కొలమానాలను అధిగమించి ఓ స్థాయికి వెళ్తుందన్నారు.

బజ్ వర్డ్ కాక ముందు స్ధిరత్వం

స్థిరత్వం అనేది కార్పొరేట్ ఊతపదంగా మారడానికి చాలా కాలం ముందే కుంభమేళా వృత్తాకార ఆర్థిక వ్యవస్థ సూత్రాలను పాటించిందని అదానీ తెలిపారు. గంగానది లక్షలాది మంది భక్తులను ప్రక్షాళన చేసిన తర్వాత, దాని సహజ స్థితికి తిరిగి వస్తుందని గుర్తుచేశారు. వనరుల సంరక్షణలో పురాతన పాఠాన్ని గుర్తుచేస్తుందన్నారు. ఆధునిక అభివృద్ధికి నేరుగా సమాంతరంగా కనిపిస్తుందన్నారు.

సేవ ద్వారా నాయకత్వం

కుంభమేళాలో నాయకత్వ వికేంద్రీకృత స్వభావం ఆదేశాల కంటే సేవ ద్వారా నాయకత్వం వహించడానికి శక్తివంతమైన ఉదాహరణ అని అదానీ చెబుతున్నారు. స్థానిక అధికారులు, మతపరమైన ఆదేశాలు, వాలంటీర్ల మధ్య సహకారాన్ని ఇందుకు ఉదాహరణగా చూపారు. గొప్ప నాయకత్వం అనేది ఆదేశాలు జారీ చేయడం కాదని, సమిష్టి కృషి వృద్ధి చెందే వాతావరణాన్ని సృష్టించడం అని నిరూపిస్తుందని అదానీ పేర్కొన్నారు.

అలాగే కుంభమేళా నుండి వ్యాపార సూత్రాలు కూడా నేర్చుకోవచ్చని గౌతం అదానీ తెలిపరాు. భారతదేశం 10 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యంలో ఆధునిక వ్యాపారాల కోసం కుంభమేళా విలువైన ఇన్ పుట్స్ అందిస్తుందని అదానీ అభిప్రాయపడ్డారు. ఇందులో సమ్మిళిత వృద్ధితో పాటు ఎన్నో గ్లోబల్ బిజినెస్ పాఠాలు ఉన్నాయని గౌతం అదానీ వెల్లడించారు.

సమ్మిళిత వృద్ధి-ఆధ్యాత్మిక సాంకేతికత-సాంస్కృతిక విశ్వాసం

ఆధ్యాత్మిక నాయకుల నుండి పర్యాటకులు, వ్యాపార కార్యనిర్వాహకుల వరకు కుంభమేళా అందరికీ స్వాగతం పలుకుతుందని అదానీ గుర్తుచేశారు. అదానీ గ్రూప్ సూత్రమైన "మంచితనంతో కూడిన వృద్ధి" తత్వానికి ప్రతిబింబంగా కుంభమేళాను గౌతం అదానీ చూస్తున్నారు. అలాగే ఆధ్యాత్మిక సాంకేతికతగా కూడా కుంభమేళా కనిపిస్తోందని తెలిపారు. భారతదేశం తన డిజిటల్ పురోగతిపై గర్వంగా ఉన్నా కుంభమేళా అసలైన ఆధ్యాత్మిక సాంకేతికత అంటే చూపిస్తోందన్నారు.

మానవ మెదడును అదే స్దాయిలో నిర్వహించే విలువైన పాఠాలను కుంభమేళా అందిస్తుందని అదానీ తెలిపారు. ముఖ్యంగా మానసిక, ఆరోగ్య సవాళ్లు పెరుగుతున్న యుగంలో ఇది చాలా అవసరం అన్నారు. అలాగే సాంస్కృతిక విశ్వాసాన్ని కూడా కుంభమేళా అందిస్తోందన్నారు. ప్రపంచ సంస్కృతులు సజాతీయంగా మారుతున్న తరుణంలో కుంభమేళా భారతదేశం యొక్క సాంస్కృతిక ప్రామాణికతకు నిదర్శనంగా నిలుస్తుందన్నారు. ఇది చైతన్యవంతమైన, జీవన సంప్రదాయం, దాని మూలాలను కోల్పోకుండా ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా ఉందని వెల్లడించారు.

కుంభమేళా ఆధునిక నాయకత్వానికి ఒక నమూనాగా గౌతం అదానీ అభిప్రాయపడ్డారు. ఆధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు బ్లూప్రింట్‌గా కుంభమేళా యొక్క శాశ్వత విజయాన్ని అదానీ చూస్తున్నారు. కుంభమేళా స్థిరత్వాన్ని తన ఓడరేవులు, సోలార్ పవర్ ప్రాజెక్టులతో పోల్చారు. పురాతన భారతదేశం కేవలం స్మారక కట్టడాలను మాత్రమే నిర్మించలేదని అది మిలియన్ల మందికి సేవలందించే వ్యవస్థలను సృష్టించిందని గుర్తుచేశారు.

అలాగే కుంభమేళా భారతదేశం యొక్క ప్రత్యేకమైన మృదువైన శక్తిని సూచిస్తుందన్నారు. ఇది సైనిక శక్తి లేదా ఆర్థిక శక్తిపై ఆధారపడకుండా సాంస్కృతిక, ఆధ్యాత్మిక శక్తిపై ఆధారపడని ఓ రకమైన ప్రభావం అన్నారు. అనేక దేశాలు కఠినమైన శక్తి ద్వారా పోటీ చేయడంపై దృష్టి సారించే ప్రపంచంలో, కుంభమేళా ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం ప్రజలను, దేశాన్ని ఏకం చేయడంలో భారతదేశం యొక్క సామర్థ్యాన్ని చూపుతుందన్నారు. అలాగే గ్లోబల్ బిజినెస్ కోసం పాఠాలు నేటి వ్యాపార ప్రపంచానికి ఒక ముఖ్యమైన నమూనాగా కుంభమేళా అందిస్తుందన్నారు. భారత్ తన లక్ష్యం వైపు కదులుతున్నప్పుడు కుంభమేళా దేశం యొక్క బలం అది నిర్మించే దానిలో మాత్రమే కాకుండా అది సంరక్షించే దానిలో ఉందని గుర్తుచేస్తుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+