సైగలతో సుష్మ స్వరాజ్‌కు నివాళి.. ఎవరో తెలుసా..? (వీడియో)
న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ తొలి క్యాబినెట్‌లో విదేశాంగ శాఖ మంత్రిగా మన్ననలు పొందారు దివంగత సుష్మస్వరాజ్. విదేశాంగ మంత్రి అంటే విదేశాలతో సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలే కాదు పౌరుల ఇక్కట్లను పట్టించుకున్నారు. వారి సమస్యలను పట్టించుకొని పరిష్కరించి వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. గల్ఫ్‌లో చిక్కుకొన్న కార్మికులను వెనక్కి తీసుకొచ్చేందుకు విశేష కృషి చేశారు. దీంతోపాటు పాకిస్థాన్‌లో తప్పిపోయిన గీతను భారత్ తీసుకొచ్చేందుకు పట్టువదలని విక్రమార్కుడిలా పోరాడారు సుష్మ.
#WATCH Indore: Geeta, the Indian girl who was brought back from Pakistan in 2015 when late Sushma Swaraj was External Affairs Minister, pays tribute. #MadhyaPradesh pic.twitter.com/OtksbYMpff
— ANI (@ANI) August 7, 2019
గీత అనే చెవిటి, మూగ యువతి పాకిస్థాన్ చెర నుంచి విడిపించేందుకు అప్పటి విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. 12 ఏళ్ల వయస్సున్నప్పుడు తప్పిపోయిన గీత .. దాదాపు 15 ఏళ్లు పాకిస్థాన్‌లో మగ్గిపోయారు. బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన బజ్‌రంగీ బాయిజాన్ సినిమా ప్రేరణగా గీతను భారత్ తీసుకొచ్చేందుకు దోహద పడింది. గీత విషయం తెలుసుకున్న సుష్మ స్వరాజ్ .. భారత్ తీసుకొచ్చేందుకు కృషిచేశారు. పాకిస్థాన్‌లోని కరాచీ కోర్టులో కేసు కూడా వేశారు. చివరికీ ఆ అమ్మాయి స్వస్థలం భారత్ అని నిరూపించారు.

ఎట్టకేలకు 2015లో ఆమెను భారత్ తీసుకొచ్చారు. పాకిస్థాన్‌లో మగ్గిన తాను భారత్ తిరిగి రావడం వెనక సుష్మ స్వరాజ్ హఠాన్మరణం గీతను పుట్టెడు దు:ఖంలోకి నెట్టింది. పాక్ చెరలో ఉన్న తనకు విముక్తి కల్పించిన ధీర వనిత ఇకలేరనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. మాటలు రాని ఆ మూగ యువతి సైగలతో సుష్మ స్వరాజ్ మృతికి సంతాపం తెలిపారు. పాక్ కబంధ హస్తాల్లో 15 ఏళ్లు ఉన్న తనకు స్వేచ్ఛ వాయువులు కల్పించిన సుష్మకు జీవితాంత రుణపడి ఉంటానని అంజలి ఘటించారు.
గీత ..27 ఏళ్ల చెవిటి, మూగ మహిళ. ఆమెకు 11 ఏళ్ల వయస్సున్నప్పుడు తప్పిపోయి పాకిస్థాన్ చేరారు. 2003లో అనుకోకుండా సరిహద్దు దాటి పాకిస్థాన్ వెళ్లారు. అక్కడ ఆమెను రేంజర్లు అదుపులోకి తీసుకుని .. లాహోర్ తరలించారు. అక్కడ ఓ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఆశ్రమానికి అప్పగించారు. తనకు మాటలు వస్తే ఏం జరిగిందో .. ఎక్కడి నుంచి వచ్చానో చెప్పేవారు. కానీ గీతకు మాటలు రాకపోవడం ఆమె పట్ల శాపంగా మారింది. దీంతో 15 ఏళ్లు పాకిస్థాన్‌లో ఉండిపోయింది. చివరికి ఎలాగోలా విషయం తెలిసి గీతను భారత్ తీసుకొచ్చారు. 2015లో గీత భారత్ చేరడంలో కీ రోల్ పోషించింది మాత్రం దివంగత సుష్మ స్వరాజే.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications