వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

13 మంది మృతి.. హెలికాప్టర్ ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్పారంటే..

|
Google Oneindia TeluguNews

కూనూరు వద్ద కూలిన హెలికాప్టర్ నుంచి ప్రత్యక్ష సాక్షులు వివరాలు తెలియజేశారు. హెలికాప్టర్ కిందకు రావడాన్ని అక్కడున్న వారు గమనించారు. అయితే అందులో ఉన్న వారు అరుస్తున్నారని కృష్ణస్వామి అనే ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తొలుత హెలికాప్టర్ పెద్ద చెట్టును ఢీ కొందని వివరించారు. ఢీ కొని కూలిపోయిందని.. వెంటనే మంటలు వచ్చాయని వివరించారు. అంతకుముందు అందులో ఉన్న వారంతా అరిచారని తెలిపారు.

ముగ్గురు కాలిపోతూ కిందకి రావడం తాను చూశానని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం తెలియజేశాం అని పేర్కొన్నారు. మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రమాదం జరిగిందని.. స్వామి తెలిపారు. తన ఇంటికి 100 మీటర్ల దూరంలో ప్రమాదం జరిగిందని చెప్పారు. హెలికాప్టర్ కూలిన తర్వాత ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు మంటలు అంటుకున్నాయని ఆయన తెలిపారు. తమ చుట్టు పక్కల ఉండేవారిని సాయం చేసేందుకు పిలిచానని తెలిపారు. ఫైరింజన్, అత్యవసర సేవలకు ఇన్ఫర్మేషన్ ఇచ్చామని పేర్కొన్నారు.

Gen Bipin Rawat chopper crash: Helicopter hit trees, burst into flames:eyewitness

తమిళనాడు కూనూరు దగ్గర ఆర్మీ హెలికాప్టర్ కూలిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో హెలికాప్టర్‌లో సీడీఎస్‌ జనరల్ బిపిన్‌ రావత్‌తో పాటు మరో ముగ్గురు ఆర్మీ ఉన్నతాధికారులు వున్నారు. ప్రమాదంలో 13 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన భార్య కూడా ఉన్నారు. హెలికాప్టర్‌లో 14 మంది ఉండగా.. ఒక్కరే ప్రాణాలతో బయటపడి చికిత్స తీసుకుంటున్నారు. వారు బిపిన్ రావత్ అన్నారు. రావత్ భార్య మధులిక కూడా చనిపోయినట్టు తెలుస్తోంది.

రావత్ హెలికాప్టర్ ప్రమాదంపై ఢిల్లీలో వేగంగా పరిణామాలు మారుతున్నాయి. తొలుత రావత్ ఇంటికి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెళ్లారు. ముంబై పర్యటనను రాష్ట్రపతి కోవింద్ రద్దు చేసుకొని.. ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రధాన మంత్రి మోడీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. భేటీ తర్వాత ప్రమాదం గురించి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇటు రేపు పార్లమెంట్‌లో ప్రమాద ఘటన గురించి ప్రకటన చేసే అవకాశం ఉంది.

English summary
Tamil Nadu's Coonoor helicopter crashed "I first heard a loud noise. When I came outside to see what had happened, I saw the helicopter crash into a tree eyewitness Krishnaswamy said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X