త్రివిధ దళాధిపతిగా జనరల్ నరవణె - బిపిన్ రావత్ స్థానంలో : బాధ్యతల స్వీకరణ..!!
త్రివిధ దళాల అధిపతుల కమిటీ ఛైర్మన్‌గా సైన్యాధిపతి జనరల్ ఎంఎం నరవణె బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఈ పదవిలో ఉన్న సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ఇటీవల ఆకస్మిక మరణంతో ఆ స్థానంలో నరవణెను నియమించారు. త్రివిధ దళాల అధిపతుల్లో ఆయనే సీనియర్ కావడంతో ఈ బాధ్యతలు అప్పగించారు. త్రివిధ దళాల్లో టాప్ ఆఫీసర్‌ను సీడీఎస్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. జనరల్ బిపిన్ రావత్ తర్వాత ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె సీనియర్ అధికారి.
Recommended Video

బిపిన్ రావత్ స్థానంలో నరవణే
త్రివిధ దళాల్లో ఉన్నతాధికారుల వివరాలు చూస్తే జనరల్ నరవణె కంటే ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి, నావీ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ సుమారు రెండేళ్లు జూనియర్లు. దీంతో నరవణెను సీడీఎస్‌గా కేంద్రం నియమించింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్(సీడీఎస్) పదవిని సృష్టించక ముందు వరకు ఈ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ(సీవోఎస్‌సీ)కి త్రివిధ దళాల అధిపతుల్లో సీనియర్ అయిన వ్యక్తిని ఛైర్మన్‌గా నియమించేవారు. సీడీఎస్ నియామకం తర్వాత నుంచి ఈ కమిటీకి జనరల్ రావత్ ఛైర్మన్‌గా కొనసాగారు.

అందరి కంటే సీనియర్ కావటంతో
డిసెంబరు 8న తమిళనాడులో సైనిక హెలికాప్టర్ కుప్పకూలిన దుర్ఘటనలో జనరల్ రావత్ దంపతులు సహా 14 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీవోఎస్‌సీ కమిటీ బుధవారం సమావేశమై రావత్ దంపతులకు నివాళులర్పించింది. జనరల్ నరవణె.. 2019 డిసెంబరు 31న ఆర్మీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు.. వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి ఈ ఏడాది సెప్టెంబరు 30న, నేవీ చీఫ్ అడ్మిరల్ ఆర్. హరికుమార్ నవంబరు 30న బాధ్యతలు చేపట్టారు.

తండ్రి ఏయిర్ ఫోర్స్ అధికారిగా..
మహారాష్ట్రకు చెందిన ముకుంద్ నరవాణే 1960, ఏప్రిల్ 22న జన్మించారు. ఆయన 27వ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ గా పని చేస్తున్నారు. ఆయన తల్లి ఆల్ ఇండియ రేడియోలో పని చేయగా.. తండ్రి ఏయిర్ ఫోర్స్ లో వింగ్ కమాండర్ గా పని చేసారు. పూణేలో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసారు. పూణేలోని జాతీయ ఢిఫెన్స్ అకాడమీ, డెహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో శిక్షణ తీసుకున్నారు. చెన్నైలోని ఢిఫెన్స్ స్డడీస్ లో మాస్టర్ డిగ్రీ పొందారు. 1980 లో సర్వీసులో ప్రవేశించారు. జమ్ము కాశ్మీర్.. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక హోదాల్ల పని చేసారు. శ్రీలంక కు భాతర్ నుంచి వెళ్లిన శాంతి దళాల్లో కీలక పాత్ర పోషించారు.

పలు అవార్డులు..ప్రశంసలు
నరవాణే తన కెరీర్ లో పరం విశిష్ఠ సేవా మెడల్ (2019) లో, విశిష్ఠ సేవా మెడల్ (2017)లో, సేనా మెడల్, విశిష్ణ్ సేవా మెడల్ (2015) పొందారు. సిఖ్ లైట్ నుంచి చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ మూడో అధికారిగా నరవణే నియమితులయ్యారు. గతంలో వేద ప్రకావ్ మాలిక్...జనరల్ బిక్రం సింగ్ ఇదే రెజిమెంట్ నుంచి సర్వసైనాధ్యక్షుడి హోదాలో వ్యవహరించారు. నవరానే సతీమణి టీచర్ గా పని చేస్తున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. ఇక, ఇప్పుడు సీడీఎస్ గా బిపిన్ రావత్ ఆకస్మిక మరణంతో నవరణే ఈ హోదాలో నియమితులయ్యారు.












Click it and Unblock the Notifications