హర్యానా ఎన్నికల్లో మహిళలపై వివక్ష-60 ఏళ్లలో ఎన్నికైంది 87 మందే..!

హర్యానా అసెంబ్లీకి వచ్చే నెల 5న ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో మరోసారి లింగ వివక్ష అంశం తెరపైకి వస్తోంది. దీనికి కారణం ఇక్కడ మహిళా అభ్యర్ధులకు ఎదురవుతున్న అనుభవాలే. మహిళలతో పోలిస్తే పురుష అభ్యర్ధుల్ని ఎన్నుకునేందుకు ఇక్కడి ఓటర్లు మొగ్గు చూపుతుంటారు. గత 60 ఏళ్లలో ఇక్కడ కేవలం 87 మంది మహిళలు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాగలిగారు. ఇప్పటివరకూ ఒక్క మహిళా ముఖ్యమంత్రి కూడా ఎన్నిక కాలేదు. దీంతో ఈ లింగ వివక్ష చర్చనీయాంశమవుతోంది.

ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లోనూ అన్ని పార్టీలు కలిపి కేవలం 51 మంది అభ్యర్ధుల్ని మాత్రమే నిలబెట్టాయి. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో ఇది దాదాపు సగం మాత్రమే. అంటే సగటున ఒక్కో సీటుకు ఒక మహిళా అభ్యర్ధి కూడా లేరు. దీంతో మరోసారి హర్యానా ఎన్నికల్లో లింగ వివక్ష తెరపైకి వస్తోంది. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధికంగా 12 మంది మహిళల్ని బరిలోకి దింపుతోంది. ఆ తర్వాత స్ధానంలో ఐఎన్ఎల్డీ, బీఎస్పీ కూటమి 11 మందిని, ఆప్, జేజేపీ,ఏఎస్పీ కూటమి పదేసి మంది మహిళలకు అవకాశమిచ్చాయి.

gender discrimination in harayana polls as only 87 women elected in last 60 years

2000 సంవత్సరం వరకూ చూసుకుంటే కేవలం 47 మంది మహిళలు మాత్రమే హర్యానా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఇప్పటికే హర్యానా మహిళల జనాభా విషయంలోనూ కేవలం 916 మందితో వెనుకబడి ఉంది. అయితే 2019 ఎన్నికల్లో 104 మంది మహిళలు పోటీ చేసినా కేవలం 9 మంది మాత్రమే గెలిచారు. 2014లో మాత్రం 116 మంది పోటీ చేస్తే అత్యధికంగా 13 మంది గెలిచారు. దీంతో ఈసారి 51 మందికి మాత్రమే పార్టీలు అవకాశం కల్పించాయి. వీరిలో ఎంత మంది గెలుస్తారో తెలియని పరిస్ధితి. ఇందులో కాంగ్రెస్ బరిలోకి దింపిన రెజ్లర్ వినేష్ ఫోగట్ కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+