చదువుకున్న మూర్ఖత్వం అంటే ఇదేరా భై.. లిఫ్టులోనే పోసేసిండు!(వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇందిరాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అహింసా ఖండ్-1 ప్రాంతంలో ఉన్న 'పిప్రా కృష్ణ విస్టా'అనే హైరైజ్ అపార్ట్మెంట్ సొసైటీలో ఈ ఘటన జరిగింది. సోమవారం సాయంత్రం ఎఫ్-2 టవర్లోని లిఫ్టులోకి ప్రవేశించిన ఓ యువకుడు ఏకంగా లిఫ్టు లోపలే మూత్ర విసర్జన చేశాడు. లిఫ్ట్ ప్రయాణంలో ఉన్న సమయంలోనే అతడు ఈ పని చేయడం మధ్య మధ్యలో పలు అంతస్తుల్లో లిఫ్ట్ ఆగి తలుపులు తెరుచుకున్నప్పటికీ ఆ వ్యక్తి ఏ మాత్రం పట్టించుకోకుండా తన విపరీతాన్ని కొనసాగించడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
లిఫ్ట్ ఉపయోగించిన ఇతర నివాసితులు తీవ్రమైన దుర్వాసన రావడంతో సొసైటీ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్, మెయింటెనెన్స్ విభాగానికి ఫిర్యాదు చేశారు. నివాసితుల ఫిర్యాదుల మేరకు లిఫ్టులో అమర్చిన సీసీటీవీ కెమెరా ఫుటేజీని అధికారులు పరిశీలించగా.. ఆ యువకుడి అసహ్యకరమైన చర్య స్పష్టంగా రికార్డయి బయటపడింది. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో నిమిషాల్లోనే వైరల్‌గా మారింది. లక్షల రూపాయలు వెచ్చించి ఆధునిక, పరిశుభ్రమైన వాతావరణం కోసం ఫ్లాట్లు కొనుగోలు చేస్తే ఇలాంటి చదువుకున్న మూర్ఖుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని నివాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

లిఫ్టులు వంటి మూసి ఉన్న ప్రాంతాల్లో ఇలాంటి చర్యల వల్ల దుర్వాసన వ్యాపించడమే కాకుండా చిన్నపిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఉన్నవారికి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని సొసైటీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. కామన్ ఏరియాలను, ప్రభుత్వ ఆస్తులను అందరూ బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా స్థానికులు కోరుతున్నారు.
ఈ ఘటనపై స్పందించిన పిప్రా కృష్ణ విస్టారెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ఆ యువకుడి చర్య సభ్యసమాజానికి ఏ మాత్రం శ్రేయస్కరం కాదని మండిపడ్డారు. బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించిన ఆ యువకుడిని గుర్తించి, అతనికి, అతడి కుటుంబానికి కౌన్సిలింగ్ ఇస్తామని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. భవిష్యత్తులో సొసైటీ ప్రాంగణంలో లేదా లిఫ్టులలో ఇలాంటి మర్యాద లేని, అపరిశుభ్రమైన చర్యలను రిపీట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
लिफ्ट में मूत्र विसर्जन...कौन हैं ये सज्जन?
— SKY (@ysatyandra) September 22, 2026
वीडियो उत्तर प्रदेश के गाजियाबाद का है। इंदिरापुरम के अहिंसा खंड-1 में स्थित शिप्रा कृष्णा विस्टा सोसायटी के लिफ्ट में चढ़ते ही महोदय मूतना शुरू कर दिए। लिफ्ट की डोर खुलती और बंद होती रही और इसी क्रम में इनका फ्लोर आ गया...अपने फ्लोर… pic.twitter.com/mN7vSKMr8b













Click it and Unblock the Notifications
