వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నో పాలిట్రిక్స్ ఇన్ శ్రీనగర్ : ఎయిర్ పోర్టులో అజాద్‌ను అడ్డుకుని వెనక్కి పంపిన పోలీసులు

|
Google Oneindia TeluguNews

జమ్ము అండ్ కశ్మీర్‌ విభజన తర్వాత మొదటి సారి శ్రీనగర్‌కు వెళ్లిన కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ, మాజీ ముఖ్యమంత్రి గులాంనబి అజాద్‌ను స్థానిక పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీ నుండి శ్రీనగర్‌కు వెళ్లిన అజాద్‌ను ఏయిర్ పోర్టులోనే నిలిపివేశారు. ఎయిర్ పోర్టు నుండి శ్రీనగర్ నగరానికి వెళ్లకుండా చేశారు. దీంతో ఉదయం శ్రీనగర్ వెళ్లిన ఆజాద్ తిరిగి సాయంత్రం ఢిల్లీకి చేరుకోనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.

 అజాద్ శ్రీనగర్ వెళ్లకుండా ఎయిర్‌పోర్టులో అడ్డగింత

అజాద్ శ్రీనగర్ వెళ్లకుండా ఎయిర్‌పోర్టులో అడ్డగింత

రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్న గులాంనబి అజాద్ శ్రీనగర్ లో పర్యటించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యోందుకు ఉదయం ఢిల్లీ నుండి వెళ్లాడు. అయితే శ్రీనగర్ ఎయిర్ పోర్టులోనే ఆయన్ను స్ధానిక పోలీసులు అనుమతి లేదని అడ్డుకున్నారు. దీంతో అజాద్ స్పందించారు. శ్రీనగర్ వెళ్లడానికి ఎవరి అనుమతి అవసరం లేదని, పార్లమెంట్ సమావేశాల అనంతరం శ్రీనగర్‌కు తాను రెగ్యులర్‌గా వెళతానని అన్నారు. కాగా అజాద్ 2005 నుండి 2008 వరకు ముఖ్యమంత్రిగా చేసి ప్రస్థుతం జమ్ము కశ్మీర్ నుండి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు.

శ్రీనగర్ వెళ్లేముందు వివాస్పద వ్యాఖ్యలు చేసిన అజాద్

కాగా అజాద్ శ్రీనగర్ వెళ్లేముందు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ బుధవారం కశ్మీర్‌లో పర్యటించి అక్కడి శాంతి భద్రతలపై సమీక్ష జరిపాడు. ఈనేపథ్యంలోనే స్థానికులతో కలిసి ఆయన భోజనం చేశాడు. అయితే డబ్బులు ఇచ్చి స్థానిక ప్రజలను తనవెంట తీసుకువెళ్లారని ఆయన ఆరోపణలు చేశాడు. ఈ నేఫధ్యంలోనే బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలను ఖండిస్తూ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

రెండు రోజులుగా ఎలాంటీ సంఘటనలు జరగకుండా చర్యలు

జమ్ము కశ్మీర్‌లో ప్రాంతంలో ఎలాంటీ రాజకీయ అవకాశాలకు తావు లేకుండా కేంద్రం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిరసనలు లేకుండా జాగ్రత్త పడుతోంది. ఈ నేపథ్యంలోనే స్థానిక నేతలను గ‌ృహ నిర్భంధం చేసింది. ఈనేపథ్యంలోనే ఎన్సీపీ నేత ఒమర్ అబ్ధుల్లా హౌజ్ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక పలువురు రాజకీయ నాయకులను సైతం రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. దీంతో జమ్ము కశ్మీర్ పై చారీత్రక నిర్ణయం తీసుకున్న ఎలాంటీ అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు.

English summary
Leader of the Opposition in Rajya Sabha and former Jammu and Kashmir chief minister Ghulam Nabi Azad has been stopped from entering Srinagar city and is being sent back to Delhi by a late afternoon flight
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X