Gilr: పెళ్లి చేసుకుంటానని అమ్మాయితో ?, మూడు నెలలు జైల్లో, బెయిల్ మీద వస్తే కత్తులతో ?, సీసీటీవీల్లో !

చెన్నై/ కోయంబత్తూరు: సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న వ్యక్తి అతని స్టోర్ లో కొందరు అమ్మాయిలను సేల్స్ గర్ల్స్ గా పెట్టుకున్నాడు. సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న యువతితో అతను చాలా చనువుగా ఉన్నాడు. కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అతను ఆమెతో మూడు నెలలుగా ఎంజాయ్ చేస్తున్నాడు. కొన్ని నెలల క్రితం అమ్మాయికి మాయమాటలు చెప్పి అతను లేపుకుపోయాడని అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు సూపర్ మార్కెట్ యజమాని మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. మూడు నెలలు జైల్లో ఉన్న వ్యక్తి నాలుగు రోజుల ముందు బెయిల్ మీద బయటకు వచ్చాడు. రాత్రి సూపర్ మార్కెట్ లో వ్యాపారం ముగించుకున్న వ్యక్తి ఇంటికి వెలుతున్న సమయంలో కత్తులతో అతని మీద దాడి చెయ్యడం కలకలం రేపింది.

సూపర్ మార్కెట్ యజమాని

సూపర్ మార్కెట్ యజమాని


తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని వెల్లియంకడు ప్రాంతంలో ప్రిన్స్ (48) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్న ప్రిన్స్ అతని స్టోర్ లో కొందరు అమ్మాయిలను సేల్స్ గర్ల్స్ గా పెట్టుకున్నాడు. ప్రిన్స్ సూపర్ మార్కెట్ లో పనప్పపాళ్యంలో నివాసం ఉంటున్న 17 ఏళ్ల అమ్మాయి సేల్స్ గర్ల్ గా ఉద్యోగం చేస్తున్నది.

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు

పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు

సూపర్ మార్కెట్ లో పని చేస్తున్న యువతితో ప్రిన్స్ చాలా చనువుగా ఉన్నాడు. కూతురు వయసు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రిన్స్ గత ఆరు నెలల నుంచి ఆమెను అనేక ప్రాంతాలకు పిలుచుకుని వెళ్లి ఆమెతో ఎంజాయ్ చేశాడని తెలిసింది. మూడు నెలల క్రితం అమ్మాయితో కలిసి ప్రిన్స్ విహారయాత్రకు వెళ్లిపోయాడు.

జైలుకు పంపించిన పోలీసులు

జైలుకు పంపించిన పోలీసులు


మూడు నెలల క్రితం అమ్మాయికి మాయమాటలు చెప్పి ప్రిన్స్ ఆమెను లేపుకుపోయాడని అమ్మాయి కుటుంబ సభ్యులు కేసు పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు సూపర్ మార్కెట్ యజమాని ప్రిన్స్ మీద ఫోక్స్ చట్టం కింద కేసు నమోదు చేశారు. తమిళనాడులోని నీలగిరిలో అమ్మాయితో పాటు ఉన్న ప్రిన్స్ ను పోలీసులు అరెస్టు చేసి అతన్ని కోయంబత్తూరు జిల్లా జైలకు పంపించారు.

 షాపు ముందే చంపేయాలని స్కెచ్

షాపు ముందే చంపేయాలని స్కెచ్

మూడు నెలలు జైల్లో ఉన్న ప్రిన్స్ నాలుగు రోజుల ముందు బెయిల్ మీద బయటకు వచ్చాడు. రాత్రి సూపర్ మార్కెట్ లో వ్యాపారం ముగించుకున్న ప్రిన్స్ స్టోర్ కు తాళం వేసి ఇంటికి వెలుతున్న సమయంలో కత్తులతో అతని మీద దాడి చెయ్యడం కలకలం రేపింది. తీవ్రగాయాలైన ప్రిన్స్ కు స్థానిక ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి తరువాత కోయంబత్తూరు ఆసుపత్రికి తరలించారు.

Recommended Video

    Omicron : Omicron Likely To Effect Who Have Recovered From Covid-19 || Oneindia Telugu
    సీసీటీవీ కెమెరాల్లో ?

    సీసీటీవీ కెమెరాల్లో ?

    ప్రిన్స్ మీద దాడి చేస్తున్న సమయంలో అతని సూపర్ మార్కెట్ ముందు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో మొత్తం రికార్డు అయ్యిందని పోలీసులు అంటున్నారు. ప్రిన్స్ జైలుకు వెళ్లడానికి కారణం అయిన అమ్మాయి కుటుంబ సభ్యులు లేదా బంధువులు ఎవరైనా ప్రిన్స్ మీద హత్యాయత్నం చేశారా ?, లేక వేరే ఏమైనా కారణాలు ఉన్నాయా ? అని విచారణ చేస్తున్నామని కోయంబత్తూరు జిల్లా పోలీసులు తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+