రండి మేడమ్ రండి: పన్నీర్ సెల్వంతో కొత్త సీఎస్, కథ ఏంటీ ?

చెన్నై: తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గిరిజా వైద్యనాథన్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సెక్రటేరియట్ లో తమిళనాడు సీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత గిరిజా వైద్య నాథన్ ను పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు అభినందించారు.

అనంతరం గిరిజా వైద్యనాథన్ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంను కలుసుకున్నారు. ఈ సందర్బంగా మీకు ఉద్యోగరీత్యా అంతా మంచే జరగాలని పన్నీర్ సెల్వం గిరిజా వైద్యనాథన్ తో అన్నారు. ఇదే సమయంలో సీఎం పన్నీర్ సెల్వంతో గిరిజా వైద్యనాథన్ చర్చించారు.

Girija Vaidyanathan take charge chief secretary of Tamil Nadu

తమిళనాడు ప్రభుత్వం ప్రస్తుతం చేపడుతున్న అభివృద్ది పనులు, సంక్షేమ పథకాల గురించి ఇద్దరూ చర్చించారు. ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ది పనులకు తాను పూర్తిగా సహకరిస్తానని ఇదే సమయంలో గిరిజా వైద్యనాథన్ సీఎం పన్నీర్ సెల్వంకు హామి ఇచ్చారని సమాచారం.

అనంతరం గిరిజా వైద్యనాథన్ విధులలో నిమగ్నం అయ్యారు. అవినీతి ఆరోపణలు రావడంతో ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చెయ్యడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న రామ్మోహన్ రావు పదవి ఊడిపోయిన విషయం తెలిసిందే. రామ్మోహన్ రావు స్థానంలో గిరిజా వైద్యనాథన్ భాద్యతలు స్వీకరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+