భర్తకు షాక్: తలాక్ చెప్పిన భార్య, కారణం మంచిదే!

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా: దేశంలో ట్రిపుల్ తలాక్‌పై తీవ్ర చర్చ జరుగుతున్న తరుణంలో కోల్‌కతాలో చోటు చేసుకున్న ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చదువుకోవడానికి అడ్డు చెప్పాడని ఓ 16ఏళ్ల బాలిక తన భర్తకు ముమ్మారు తలాక్‌ చెప్పేసింది. దీంతో ఆమె బంధువులందరూ ఆశ్చర్యపోయారు. ఈ సందర్భంగా పలువురు ఆమె చేసిన పనిని అభినందించారు.

వివరాల్లోకి వెళితే.. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాకి చెందిన 16ఏళ్ల మంపి తొమ్మిదో తరగతి చదువుకుంటున్న సమయంలోనే తల్లిదండ్రులు పెళ్లి చేశారు.
పెళ్లైన తర్వాత కూడా చదువు కొనసాగించేందుకు అప్పుడు ఆమె భర్త ఒప్పుకొన్నాడు. కానీ ఆ తర్వాత మంపి పాఠశాలకు వెళ్లడం, చదువుకోవడానికి అభ్యంతరం తెలిపాడు.

Girl, 16, gives talaq to hubby for opposing her education

పదో తరగతిలో చేర్పించమని భర్తను అడిగినా, పట్టించుకోకపోవడంతో ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లిపోయింది. చదువుకునేందుకు అనుమతిస్తేనే అత్తవారింటికి వస్తానని తెగేసి చెప్పింది. దీంతో ఆమె తల్లిదండ్రులు మంపిని మథురాపూర్‌లో ఉన్న ఓ పాఠశాలలో పదో తరగతికి చేర్పించారు.

విషయం తెలుసుకున్న భర్త మంపి ఇంటికి వచ్చి తన వెంట వచ్చేయాలని గొడవ పెట్టుకున్నాడు. అందుకు నిరాకరించిన మంపి గట్టిగా కేకలు వేస్తూ భర్తకు మూడు సార్లు తలాక్‌ చెప్పేసింది. దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైన ఆమె భర్త అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. దీంతో మంపి ఆనందం వ్యక్తం చేసింది. తనకు తన తల్లిదండ్రులు అండగా నిలిచారని చెప్పుకొచ్చింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
As the country debates the need to abolish triple talaq, a 16-year-old girl from rural Bengal has stunned a section of the community by uttering 'talaq' thrice to divorce her husband because he opposed her wish to continue studies.
Please Wait while comments are loading...