Girl: కాలేజ్ అమ్మాయిని కిడ్నాప్ చేసి ?, 20 ఏళ్ల జైలు శిక్ష వేసిన కోర్టు, కాలేజ్ అమ్మాయితో !
చెన్నై/క్రిష్ణగిరి: వివాహం చేసుకున్న వ్యక్తికి భార్య, పిల్లలు ఉన్నారు. భార్యతో కాపురం చేస్తున్న వ్యక్తి ఓ కాలేజ్ అమ్మాయి వెంటపడ్డాడు. చాలాకాలం పాటు కాలేజ్ అమ్మాయి వెంట తిరిగిన వ్యక్తి ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే అప్పటికే పెళ్లి చేసుకున్న వ్యక్తికి దూరంగా ఉండాలని కాలేజ్ అమ్మాయి డిసైడ్ అయ్యింది.
తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలోని ఉదంగరై సమీపంలోని పుంగైన ్రామంో తమిళరసన్ (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. తమిళరసన్ కు ఇంతకు ముందే వివాహం అయ్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. తమిళరసన్ నివాసం ఉంటున్న గ్రామంలోనే నివాసం ఉంటున్న 17 ఏళ్ల యువతి కాలేజ్ లో చదువుకుంటున్నది.

కాలేజ్ కు వెలుతున్న 17 ఏళ్ల అమ్మాయిని బెదిరించిన కామాంధుడు తమిళరసన్ ఆమెతో మాట్లాడటానికి అనేక ప్రయత్నాలు చేశాడు. భార్యతో కాపురం చేస్తున్న తమిళరసన్ కాలేజ్ అమ్మాయి వెంటపడుతూనే ఉన్నాడు. చాలాకాలం పాటు కాలేజ్ అమ్మాయి వెంట తిరిగిన తమిళరసన్ ఆమెను 2018లో కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడు.
విషయం బయటకు చెబితే చంపేస్తానని తమిళరసన్ కాలేజ్ అమ్మాయిని బెదిరించాడు. అమ్మాయి ఐదు నెలల గర్బవతి అయిన తరువాత విషయం వెలుగు చూసింది. పుట్టిన బిడ్డ చనిపోవడం, 2019లో కాలేజ్ అమ్మాయి కూడా చనిపోవడంతో తమిళరసన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుంచి కేసు విచారణ జరుగుతోంది, తమిళరసన్ నేరం చేశాడని రుజువు కావడంతో అతనికి కోర్టు 20 ఏళ్లు జైలు శిక్ష విధించింది.












Click it and Unblock the Notifications