Girl: లవర్ అరాచకం, అందంగా ఉన్నావని నీకు అహంకారం, జీవితాంతం నీకు నీఅందం దూరం చేస్తా !

నన్నే ప్రేమించవా, నీకు ఎంత గర్వం, నువ్వు అందంగా ఉన్నావని నీకు అహంకారం, నీకు జీవితాంతం నీ అందం దూరం చేస్తాను అని రెచ్చిపోయిన కిరాతకుడు యాసిడ్ తీసుకెళ్లి అమ్మాయి ముఖం మీద పోశాడు.

బెంగళూరు/రామనగర్: మైనర్ అమ్మాయి అందంగా ఉండటంతో ఓ యువకుడు ఆమె వెంటపడ్డాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నా, నువ్వు నన్ను ప్రేమించాలని, మనం పెళ్లి చేసుకుందామని ఆ యువతికి చెప్పాడు. అయితే యువకుడి తిక్కచేష్టలు చూసిన మైనర్ అమ్మాయి నేను నిన్ను ప్రేమించను అని కచ్చితంగా చెప్పింది. నన్నే ప్రేమించవా, నీకు ఎంత గర్వం, నువ్వు అందంగా ఉన్నావని నీకు అహంకారం, నీకు జీవితాంతం నీ అందం దూరం చేస్తాను అని రెచ్చిపోయిన కిరాతకుడు యాసిడ్ తీసుకెళ్లి అమ్మాయి ముఖం మీద పోశాడు. వన్ సైడ్ లవర్ అరాచకానికి అమాయకురాలైన బాలిక తీవ్రగాయాలై ఆసుపత్రిలో ఉంది.

మైనర్ అమ్మాయి వెంటపడ్డాడు

మైనర్ అమ్మాయి వెంటపడ్డాడు

కర్ణాటకలోని రామనగర్ జిల్లాలోని కనకపురలో (బెంగళూరు శివార్లు)లో ఓ మైనర్ అమ్మాయి నివాసం ఉంటున్నది. కనకపురలోని కురుపేట ఏరియాలో సుమంత్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. మైనర్ అమ్మాయి వెంటపడిన సుమంత్ తనను ప్రేమించాలని ఆమెను టార్చర్ పెట్టాడు. నేను నిన్ను ప్రేమించనని, మా కుటుంబ సభ్యులు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ఆమె చెప్పింది. సుమంత్ ప్రేమిస్తున్న అమ్మాయి మైనర్.

జీవితాంతం నీకు నీ అందం దూరం చేస్తా !

జీవితాంతం నీకు నీ అందం దూరం చేస్తా !

కనకపుర బైపాస్ రోడ్డులోని నారాయణప్ప సరస్సు సమీపంలో తన ప్రేమను తిరస్కరిస్తావా, నీకు నీ అందం చూసుకునే గర్వపడుతున్నావని, జీవితాంతం ఆ అందం లేకుండా చేస్తానని సుమంత్ ఆమెతో గొడవ పెట్టుకున్నాడు. అప్పుడు కూడా ఆ అమ్మాయి అతన్ని ప్రేమించడానికి తిరస్కరించిందది. ఆ సమయంలో రగిలిపోయిన సుమంత్ వెంట బాటిల్ లో తీసుకెళ్లిన యాసిడ్ మైనర్ అమ్మాయి ముఖం మీద పోసి అక్కడి నుంచి పరారైనాడు.

బెంగళూరులో బాలిక

బెంగళూరులో బాలిక

తీవ్రగాయాలైన మైనర్ అమ్మాయిని కనకపురలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. కనకపురలోని కురుపేటలో నివాసం ఉంటున్న సుమంత్ తన మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. యాసిడ్ దాడిలో మైనర్ బాలిక ఎడమ కంటికి తీవ్రగాయం కావడంతో ఆమెను బెంగళూరులోని మింటో ఆసుపత్రికి తరలించారు.

మహిళా కమీషన్ సీరియస్

మహిళా కమీషన్ సీరియస్

కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ రామనగర జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి మైనర్ బాలికపై యాసిడ్ దాడి ఘటనపై సమాచారం ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. యువతి మీద యాసిడ్ దాడి చేసిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ మింటో ఆసుపత్రిలో యువతిని పరామర్శించారు.

వివరాలు తెలుసుకున్న కార్తీక్ రెడ్డి

వివరాలు తెలుసుకున్న కార్తీక్ రెడ్డి

కనకపుర పోలీస్ స్టేషన్‌లో సుమంత్ మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు యాసిడ్ దాడి చేసిన వ్యక్తి కోసం గాలిస్తున్నారు. రామనగర ఎస్పీ కార్తీక్ రెడ్డి సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. బాధితురాలిని జిల్లా ఎస్పీ కార్తిక్ రెడ్డి విచారించి వివరాలు సేకరించారు. కర్ణాటకలో యాసిడ్ దాడులు అరికట్టడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో అక్కడ ఇలాంటి సంఘటనలు వెలుగు చూస్తూనే ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+