Pollachi: కాలేజ్ అమ్మాయి కేసు, కోర్టులో సాక్షి రహస్య విచారణ, మరో సాక్షికి డేట్ ఫిక్స్ !
పొల్లాచ్చి కాలేజ్ అమ్మాయి లైంగిక వేధింపుల వీడియో కేసు సీబీఐ చేతికి వెళ్లిపోయింది. ఇదే కేసులో ప్రముఖ సాక్షిని కోర్టులో సీక్రేట్ గా విచారణ చేసిన జడ్జ్ ఆ సమాచారాన్ని రికార్డు చేసుకున్నారు.
చెన్నై/పొల్లాచ్చి: కాలేజ్ అమ్మాయిలు, ప్రేమికులను బెదిరించి ప్రియురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ముఠా అరెస్టు అయ్యింది. ప్రముఖ పర్యాటక కేంద్రంలో ఇలాంటి దారుణాలు జరగడంతో కలకలం రేపింది. ఓ పార్టీకి చెందిన కొందరు నాయకుల అండతో ఆ పార్టీ స్టూడెంట్ లీడర్స్, ఆ పార్టీ యువజన విభాగం నాయకులు ఇప్పటికే అరెస్టు అయ్యారు. ప్రముఖ పర్యాటక కేంద్రంగా రెచ్చిపోయిన గ్యాంగ్ రేప్ ముఠా జైల్లో ఉంది. బాధితులు ఎక్కడ మా విషయం బయటకు చెబుతారో అంటూ ఇంతకాలం భయపడిపోయారు. కేసు సీబీఐ చేతికి వెళ్లిపోయింది. ఇదే కేసులో ప్రముఖ సాక్షిని కోర్టులో అందర్ని బయటకు పంపించి సీక్రేట్ గా ఆ సాక్షి ఇచ్చిన సమాచారాన్ని న్యాయమూర్తి రికార్డు చేసుకున్నారు. పొల్లాచ్చి కాలేజ్ అమ్మాయి లైంగిక వేధింపుల కేసులో మరో సాక్షిని విచారణ చెయ్యడానికి డేట్ ఫిక్స్ అయ్యింది.

అసలు ఏం జరిగిందంటే ?
తమిళనాడులోని ప్రముఖ పర్యాటక కేంద్రం అయిన పొల్లాచ్చిలో ఇటీవల కాలేజ్ లో చదువుకుంటూ ఏకాంతంగా గడపడానికి వెళ్లిన ప్రేమికులను బెదిరించి అమ్మాయిల లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెలుగు చూసింది. కాలేజ్ అమ్మాయిలతో పాటు అమ్మాయిలు, వివాహిత మహిళల మీద పొల్లాచ్చిలో కొంతమంది లైంగిక వేధింపులకు పాల్పడ్డారని వెలుగు చూడటంతో ఆ ప్రాంతంలోని ప్రజలతో పాటు. స్థానికులు, ప్రేమికులు హడలిపోయారు.

కాలేజ్ అమ్మాయి వీడియో ?
కాలేజ్ అమ్మాయిలు, యువతులు, వివాహిత మహిళలపై సామూహిక అత్యాచారం చేసే సమయంలో కొందరు వాటిని వీడియోలు తీసి సోషల్ మీడియాలో విడుదల చేశారు. 2019లో పొల్లాచ్చిలో కాలేజ్ అమ్మాయి మీద ఈ గ్యాంగ్ విరుచుకుపడింది. ఆ సమయంలో అన్నా మమ్మల్ని వదిలేయండి, ఇక ముందు ఇటువైపురాము అంటూ ఓయువతి వేడుకుంటున్న ఆడియో టేపులు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయ్యాయి. కాలేజ్ అమ్మాయి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ కాలేజ్ అమ్మాయి అన్నకు మ్యాటర్ తెలిసింది.

కామాంధులు కోసం వేట
2019లో పొల్లాచ్చికి సమీపంలోని ప్రాంతాల్లో కాలేజీ అమ్మాయిలను లాక్కెళ్లి దారుణంగా లైంగికంగా హింసించిన వీడియో దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. బాధిత విద్యార్థి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన తమిళనాడు పోలీసులు కేసు విచారణ చేశారు. తరువాత ఈ కేసును సీబీసీఐడీకి అప్పగిస్తు తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సీబీఐ చేతికి కేసు
ఈ కేసులో కాలేజ్ అమ్మాయి మీద లైంగిక వేధింపులకు పాల్పడిన తిరునావుక్కరసు, శబరిరాజన్, వసంతకుమార్, సతీష్, మణివణ్ణన్ పొల్లాచ్చి అరులానందం, హెరెన్ పాల్, బాబు, అరుణ్‌కుమార్‌లను సీబీసీఐడీ అధికారులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.దేశవ్యాప్తంగా కలకలం రేపిన పొల్లాచ్చి కాలేజ్ అమ్మాయి లైంగిక వేధింపుల కేసు తరువాత సీబీఐకి బదిలీ అయింది.

కోర్టులో రహస్య విచారణ
ఈ వ్యవహారంలో 9 మందిపై సీబీఐ అధికారులు ప్రత్యేక చార్జ్ షీట్ దాఖలు చేసి దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో శనివారం కోయంబత్తూరు మహిళా కోర్టులో న్యాయమూర్తి జస్టిస్ నందినీ దేవి ఎదుట వీడియో కాన్ణరెన్స్ విచారణ జరిగింది. అరెస్టయి జైలుకెళ్లిన మొత్తం 9 మంది వీడియోలో కాన్పపరెన్స్ విచారణకు హాజరైనారు. ప్రాసిక్యూటర్ ఈ కేసులో ప్రత్యక్ష సాక్షిని వ్యక్తిగతంగా హాజరు పరిచారు. రై ఘటనను న్యాయమూర్తి ఆ సాక్షిని విచారణ చేసి విరాలు రికార్డు అయ్యాయి, ఈ సాక్షి విచారణ కోర్టులో ఎవ్వరూ లేని సమయంలో న్యాయమూర్తి విచారణ చేశారు. ఇదే కేసులో మరో సాక్షిని వచ్చే నెల (మార్చి) 7వ తేదీన కోర్టు ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications