పడకగదిలో అక్కాతమ్ముళ్ల హత్య: లైంగిక దాడి?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో 18 ఏళ్ల యువతి, ఆమె తమ్ముడు దారుణ హత్యకు గురయ్యారు. పడకగదిలో వారి శవాలు పడి ఉన్నాయి. ఇంటిలోని పడకగదిలో వారి శవాలు పడి ఉన్నట్లు పోలీసులు గురువారంనాడు చెప్పారు.
వారి అంటీ గురువారం ఉదయం ఆరున్నర గంటల ప్రాంతంలో శవాలను చూసింది. తూర్పు ఢిల్లీలోని కారవాల్ నగర్‌లో భవనం మొదటి అంతస్థులో ఈ సంఘటన జరిగింది. ఇద్దరి శవాలపై కూడా కత్తిపోట్ల గుర్తులు ఉన్నాయి.

తెలిసిన వ్యక్తే వారిద్దరినీ హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. వారిని పాఠశాలకు పంపించాలనే ఉద్దేశంతో లేపడానికి వచ్చిన ఆంటీ శవాలను చూసి నివ్వెరపోయింది. అమ్మాయి చేతులు, కాళ్లు కట్టి పడేసి ఉన్నాయి.
అమ్మాయిపై లైంగిక దాడి ఏమైన జరిగిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బాలుడికి పదేళ్ల వయస్సు ఉంటుంది. శవాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications