ఎత్తుకెళ్లి రాత్రంతా రేప్ చేసి యాసిడ్ పోశారు
హైదరాబాద్: మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలోని లాహ్రోలీ గ్రామంలో బుధవారం రాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. 18 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసి ఆపై యాసిడ్ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లహ్రోలి గ్రామంలోని 19 ఏళ్ల యువతిని బుధవారం ఇద్దరు వ్యక్తులు ఆమె ఇంటి దగ్గర నుంచి ఎత్తుకెళ్లి అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఆ తర్వాత ఘటనా స్థలం వద్ద ఆమెపై యాసిడ్‌తో దాడి చేసి పారిపోయారు. ఇద్దరు వ్యక్తులను మున్నేష్ సింగ్ రాజ్‌వత్(35), ధంపేసింగ్ రాజ్‌వత్(25)గా గుర్తించారు. వీరిద్దరిపై ఉమ్రి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. వీరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ఇద్దరు వ్యక్తులు కూడా బాధితురాలికి సమీప బంధువులే. అత్యాచారం చేసిన తర్వాత యువతి ప్రైవేట్ శరీర భాగాలను, ఇతర అంగాలను కాల్చారు. ఆమె ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
రాత్రిపూట బహిర్భూమికి వెళ్లిన సమయంలో యువతిని వారిద్దరు ఎత్తుకెళ్లారని పోలీసు అధికారులు చెప్పారు. ఉదయం లేచేసరికి కుటుంబ సభ్యులకు యువతి కనిపించలేదు. దీంతో ఆమె కోసం గాలింపు చేపట్టారు. వారికి అటవీ ప్రాంతంలో యువతి అత్యంత దయనీయమైన స్తితిలో కనిపించింది.












Click it and Unblock the Notifications