బాలికపై రెండు గ్రూప్ లు గ్యాంగ్ రేప్

మధ్యప్రదేశ్: బాలిక మీద రెండు గ్రూప్ లు గ్యాంగ్ రేప్ చేసిన దారుణ సంఘటన మధ్యప్రదేశ్ లో జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు అత్యాచారం చేసిన నిందితులను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. బాలిక మీద రెండు గ్రూప్ లు గ్యాంగ్ రేప్ చేశారని పోలీసు అధికారులు తెలిపారు.

పోలీసుల కథనం మేరకు ఆలస్యంగా వెలుగు చూసిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మధ్యప్రదేశ్ లోని ధార్ కోట్ వాలి పోలీస్ స్టేషన్ పరిధిలో (13) సంవత్సరాల బాలిక నివాసం ఉంటున్నది. ఈ నెల 7వ తేదిన మహా శివరాత్రి పండుగ సందర్బంగా ఇద్దరు యువకులు బాలిక దగ్గరకు వెళ్లారు.

తరువాత బాలికను దేవాలయానికి రావాలని బలవంతం చేశారు. తెలిసిన యువకులే కదా అని నమ్మిన బాలిక వారితో కలిసి దేవాలయానికి బయలుదేరింది. బాలికను సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలోకి తీసుకు వెళ్లారు. తరువాత బాలిక మీద సామూహిక అత్యాచారం చేశారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Girl gang raped twice on successive days in Madhya Pradesh

ఆకాష్ అలియాస్ గోలు, అతని స్నేహితులు తన మీద అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదు చేసిందని పోలీసులు అంటున్నారు. మరుసటి రోజు అక్కడి నుంచి తప్పించుకుని తాను పారిపోయి నగరంలోని తన తాత ఇంటికి చేరుకున్నానని బాలిక చెప్పిందని పోలీసులు అన్నారు.

తాత ఇంటి నుంచి తన ఇంటికి వెలుతున్న సమయంలో ఇద్దరు తెలిసిన యువకులు డ్రాప్ ఇస్తామని నమ్మించి సంజయ్ కాలనీలోని ఓ ఇంటికి తీసుకు వెళ్లి ఆరు మంది గ్యాంగ్ రేప్ చేశారని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక ఫిర్యాదు మేరకు తాము కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

అప్పటికే తమ కుమార్తె కనపడటం లేదని బాలిక కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక తిరిగిరావడంతో పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించి వైద్య పరిక్షలు చేయించారు. సంతోష్, ఆకాష్ సింగ్ సింగ్ అలియాస్ గోలు, భరత్, సుభాష్ సింగ్ తో సహ పలువురు యువకుల మీద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+