ఇంట్లోకి చొరబడి కాళ్లు కట్టేసి యువతిపై గ్యాంగ్ రేప్
థానే: మహారాష్ట్రలో దారుణం చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని థానే జిల్లా షాహపూర్ తాలూకాలోని ఘోటఘర్ గ్రామంలో ఓ 22 ఏళ్ల యువతిపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
సోమవారం జరిగిన ఆ సంఘటన వివరాలను పోలీసులు బుధవారం వెల్లడించారు. ఇంట్లో ఒంటిరిగా ఉండడం చూసి ఇద్దరు వ్యక్తులు లోనికి ప్రవేశించి అత్యాచారం చేసినట్లు అసిస్టెంట్ పోలీసు ఇన్‌స్పెక్టర్ బాబూ సాహెబ్ చెప్పారు.

గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు లోనికి ప్రవేశిచి, కాళ్లు కట్టేసి, ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆయన తెలిపారు. ఆమె ప్రైవేట్ పార్ట్ట్స్‌నే కాకుండా శరీరంలో ఇతర అంగాలను కూడా గాయపరిచారు.
నేరం చేసిన తర్వాత నిందితులు పారిపోయారు. వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications