ర్యాంగింగ్‌కు అమ్మాయి బలి: బాత్రూంలో బంధించారు

బాత్ రూమ్‌లో బంధించిన కారణంగా అనారోగ్యంతో ఎనిమిది రోజుల తర్వాత విద్యార్థిని ఒండ్రిలా ప్రాణాలు విడిచింది. దీంతో ఆగ్రహానికి గురైన విద్యార్థిని బంధువులు, ప్రజలు గురువారం పాఠశాలపై దాడి చేసి కంప్యూటర్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విద్యార్థిని మృతికి కారణమైన వారిని వెంటనే శిక్షించాలని, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అయితే పాఠశాల విడిచి వెళ్లిన తర్వాత ఒండ్రిలా అనారోగ్యానికి గురవడంతో తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఒండ్రిలా తన తల్లిదండ్రులకు పాఠశాలలో జరిగిన విషయాన్ని తెలిపింది. ఒండ్రిలాను పరీక్షించిన వైద్యులు ఆమెకు భౌతికంగా ఎలాంటి అనారోగ్యం లేదని సోమవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు.
సీనియర్ల ర్యాగింగ్ కారణంగానే తమ కూతురు ఒత్తిడికి లోనై మృతి చెందినట్లు విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. అయితే విద్యార్థినికి వైద్యం చేసిన డాక్టర్ పై కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్ పరీక్షించిన తర్వాత మంగళవారం ఇంజెక్షన్ చేసి పంపించారని, మళ్లీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారని తెలిపారు. పాఠశాలలో జరిగిన సంఘటనతోపాటు వైద్యుల నిర్లక్ష్యం కూడా తన కూతురు మృతికి కారణమని విద్యార్థిని తల్లి రేఖాదాస్ ఆరోపించింది.
ఒండ్రిలా మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా విద్యార్థినిని బంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాఠశాల ప్రిన్సిపాల్ షర్మిలా సర్కార్ తెలిపారు.












Click it and Unblock the Notifications