పరువు తీసిందని కుమార్తె, ఆమె ప్రియుడ్ని చంపేశారు
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. తమ కుటుంబం పరువు తీసిందనే కోపంతో కన్న కూతురుని, ఆమె ప్రియుడిని విషమిచ్చి చంపేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గరీహసన్‌పూర్ గ్రామానికి చెందిన బోతి(18) అనే యువతి అదే ప్రాంతానికి చెందిన సంజయ్(24)ను ప్రేమించింది. వీరి ప్రేమ వ్యవహారం అంగీకరించని బోతి తల్లిదండ్రులు వారిద్దరినీ కిడ్నాప్ చేసి వారిపై విషప్రయోగం చేశారు.

అనంతరం కర్నల్ ప్రాంతంలోని ఓ ప్రదేశంలో వారిని పడేశారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న వారిని పోలీసులు గమనించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స అందిస్తుండగా.. వారిద్దరూ మృతిచెందారు.
అయితే తన కుటుంబసభ్యులు తమకు విషమిచ్చి హత్య చేశారని బోతి చనిపోయేముందు పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు బోతి తండ్రి, ఆమె బంధువులపై కేసు నమోదు చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
లైంగిక వేధింపులు: ఆటో నుంచి దూకేసిన యువతి
ఆటో డ్రైవర్ వేధింపులు భరించలేక ఓ యువతి(16) తాను ప్రయాణిస్తున్న ఆటో నుంచి దూకేసింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. గత ఆదివారం గుర్గావ్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గాయపడిన యువతిని స్థానికులు ఆస్పత్రిలో చేర్చారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications