15 ఏళ్ల ఆ బాలిక చేసిన పనికి-తల్లిదండ్రులిద్దరికీ గుండెపోటు-ఆన్‌లైన్ క్లాసుల కోసమని స్మార్ట్‌ఫోన్ కొనిస్తే...
15 ఏళ్ల ఓ బాలిక చేసిన పనికి ఆమె తల్లిదండ్రులిద్దరూ గుండెపోటుకు గురయ్యారు. కూతురు ఆన్‌లైన్ స్టడీస్ కోసమని తల్లిదండ్రులు ఆమెకు స్మార్ట్ ఫోన్ కొనివ్వగా... బాలిక చేసిన పని వారిని షాక్‌కి గురిచేసింది. బంధువులు చెప్పేంతవరకూ కూతురు ఏం చేస్తుందో ఆ తల్లిదండ్రులు గ్రహించలేకపోయారు.చివరకు, ఆ బాలికకు కౌన్సెలింగ్ ఇప్పించడంతో... ఇకపై అలాంటి పనులు చేయనని చెప్పింది. ఇంతకీ ఆ బాలిక చేసిన పనేంటి...
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన బాలికకు(15) ఆన్‌లైన్ స్టడీస్ కోసమని ఆమె తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొనిచ్చారు. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండొద్దని ఇంట్లో ఓ గదిని ఆమె చదువుకునేందుకు కేటాయించారు. బాలిక రోజూ ఆ గదిలోకి వెళ్లి స్మార్ట్‌ఫోన్‌లో ఆన్‌లైన్ క్లాసులు వినేది. ఈ క్రమంలో ఆమె దృష్టి ఆన్‌లైన్‌లో కొన్ని చెడు సైట్ల మీదకు వెళ్లింది. అందులో నగ్న ఫోటోలు,వీడియోలు ఉండటం గమనించింది.

ఆ తర్వాత నుంచి ఎప్పుడూ అవే సైట్లను చూడటం మొదలుపెట్టింది. అంతేకాదు,తన నగ్న ఫోటోలు,వీడియోలు సైతం అందులో అప్‌లోడ్ చేసింది. తన కజిన్స్‌తో ఈ విషయం చెప్పిన బాలిక... వారిని కూడా ఇలా చేయమని కోరింది. ఆమె వ్యవహారాన్ని కజిన్స్ తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో వారు బాలిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు. అది తట్టుకోలేక ఆ తల్లిదండ్రులకు గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నారు.
బాలిక వ్యవహారంపై ఆమె తల్లిదండ్రులు 181 హెల్ప్ లైన్‌కు ఫోన్ చేసి చెప్పారు. వారి సూచన మేరకు బాలికను కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లారు. బాలిక తెలియక చేస్తున్న ఆ పనులతో ఆమె ఎలా నష్టపోతుందో కౌన్సెలింగ్ టీమ్ ఆమెకు వివరించారు. ఈ వయసులో చదువుపై దృష్టి పెట్టకుండా ఇలాంటి వాటిపై దృష్టి పెడితే భవిష్యత్ పాడవుతుందని చెప్పారు. పైగా అది సైబర్ క్రైమ్ కిందకు వస్తుందని... ఇలాంటివి చేస్తే కేసుల్లో ఇరుక్కుంటావని హెచ్చరించారు. దీంతో ఆ బాలిక... ఇక తాను అలాంటి పనులు చేయనని వారికి హామీ ఇచ్చింది. బుద్ది చదువుకుంటానని... స్టడీస్ పైనే ఫోకస్ చేస్తానని చెప్పింది. తల్లిదండ్రుల సమక్షంలోనే స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తానని తెలిపింది. కూతురు ప్రవర్తనలో మార్పు రావడంతో ఆ తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ క్లాసుల ద్వారానే విద్యా బోధన జరుగుతున్న సంగతి తెలిసిందే. దాదాపుగా ఏడాదిన్నర పైగా విద్యార్థులు ఇంటి నుంచే ఆన్‌లైన్ క్లాసులు వింటున్నారు. ఆన్‌లైన్ క్లాసుల కోసం స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తుండటంతో... కొంతమంది విద్యార్థులు దారి తప్పుతున్నారు. చూడకూడని సైట్లు చూస్తున్నారు. కాబట్టి పిల్లలు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించేటప్పుడు తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి. చెడు అలవాట్లు,సావాసాలు వారికి అలవడకుండా జాగ్రత్తపడాలి.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications