స్నేహితులే కీచకులై.. బహిర్భూమికి వెళుతుంటే.. వెంటాడి..
స్నేహితులే కీచకులుగా మారిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా పట్టణంలో వెలుగుచూసింది. బహిర్భూమికి వెళుతున్న స్నేహితురాలిని వెంటాడిన స్నేహితులిద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
లక్నో : స్నేహితులే కీచకులుగా మారిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బలియా పట్టణంలో వెలుగుచూసింది. బహిర్భూమికి వెళుతున్న స్నేహితురాలిని వెంటాడిన స్నేహితులిద్దరూ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బలియా పట్టణంలోని రేవ్టీ ప్రాంతంలో పదిహేడేళ్ల అమ్మాయి బహిర్భూమికి వెళుతుండటం చూసిన ఆమె స్నేహితులు సంతోష్ రాజ్‌భర్(18), హరీశంకర్ రాజ్‌భర్ (19) వెంటాడారు. నిర్జనప్రదేశంలో స్నేహితురాలైన బాలికపై వీరిద్దరూ అత్యాచారం చేశారు.

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ, పోస్కో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్, హరీశంకర్ లను అరెస్టు చేశారు. ఆ బాలికను వైద్యపరీక్ష కోసం ఆసుపత్రికి పంపించామని ఎస్పీ అనిల్ కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications