పొగమంచులో.. నడి రోడ్డులో.. యువతిపై అత్యాచారం! అయినా ఎవరికీ ఏమీ కనిపించలేదు!

Posted By:
Subscribe to Oneindia Telugu

చండీగఢ్: దట్టంగా పొగమంచు.. ముందేముందో, పక్కనేముందో ఎవరికీ ఏమీ కనిపించడం లేదు. ఇదే అదనుగా ఓ ప్రబుద్ధుడు ఓ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. అయినా సరే ఆ రోడ్డుపై నడుస్తున్న మనుషులకు ఏమీ కనిపించలేదు.

వివరాల్లోకి వెళితే... చండీగఢ్‌ నయాగావ్‌లోని ఓ దుకాణంలో పనిచేస్తున్న యువతి తన పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. దట్టంగా అలుముకున్న పొగ మంచు కారణంగా ఎదురుగా ఏమొస్తుందో, పక్కన ఎవరున్నారో కూడా కనిపించడం లేదు.

Girl Raped on Road, Still Nobody noticed due to smong snow

హఠాత్తుగా ఓ వ్యక్తి ఆ యువతిని పట్టుకుని ఆమెపై అత్యాచారానికి తెగబడ్డాడు. ఆమె ప్రతిఘటించింది. గట్టిగా అరవబోయేసరికి నోరు నొక్కేశాడు. అంతేకాదు - 'అరవకు.. అరిచావంటే నిన్ను పొడిచేస్తా.. నేను హత్య కూడా చేశాను.. నాకేం భయం లేదు..'అంటూ అతడు బెదిరించాడు.

ఆమె నిస్సహాయ స్థితిలో గింజుకుంటూ ఉండగానే అతడు తన పని పూర్తికానిచ్చేశాడు. ఆమెను రేప్ చేసి అక్కడ్నించి పారిపోయాడు. బాధిత యువతి ఇంటికెళ్లి విలపిస్తూ జరిగిన ఘోరాన్ని తన తల్లికి వివరించింది.

దీంతో ఆమె తన కుమార్తెను తీసుకుని నయాగావ్ పోలీస్ ‌స్టేషన్‌లో జరిగిన అఘాయిత్యంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించగా వైద్యుల నివేదికలో ఆమెపై రేప్ జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు నిందితుడి కోసం గాలించి అదుపులోకి తీసుకున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A girl was raped on road side while the people are roaming on the road. But they didn't notice this crime due to heavy smog snow. This incident was happened in Nayagaon of Chandigarh. After completion of her daily duty in a shop, the girl going to her home. At that moment a man abducted, threatened her and committed rape on her. She reached the home and told to her mother about this incident. Then she took her daughter to Nayagaon police station and lodged a complaint. Police searched for the accused and arrested him.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి