నగ్నంగా రైలు పట్టాల వద్ద శవమైన అమ్మాయి
హైదరాబాద్: తన తండ్రిని కొడుతున్న గ్రామస్తులను అడ్డుకునేందుకు గ్రామ పెద్దల సమావేశంలోకి వచ్చిన ఓ బాలిక.. అక్కడ అదృశ్యమై, మర్నాడు నగ్నంగా రైలు పట్టాల సమీపంలో శవమై కనిపించిన సంఘటన జల్ పాయ్ గురి జిల్లాలోని ధూప్ గిరి గ్రామంలో జరిగింది.
తన కుమార్తెను ఇంటిముందు జరిగిన గ్రామ పెద్దల సమావేశం నుండి అహరించి.. అత్యాచారం జరిపి ఆ తర్వాత దారుణంగా హత్యచేశారంటూ తండ్రి 13 మందిపై కేసు పెట్టాడు. ఈ దుర్ఘటనపై సర్వత్రా నిరసన వ్యక్తమౌతుంది. తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన ధూప్ గురి మహిళాకౌన్సిలర్ సమక్షంలోనే ఈ ఘటన జరిగింది.

ధూప్ గురి రైతు ఒకరు ట్రాక్టర్ అద్దెకు తీసుకోని ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించలేకపోయాడు. సమయం ఇవ్వమని వేడుకున్నా గ్రామ పెద్దలు కనికరించకుండా, అతడిని కొట్టడం మొదలుపెట్టారు. ఇంటి ముందు తన తండ్రిని కొడుతుండటంతో చూసిన ఆ రైతు కుమార్తె లోపలి నుండి పరుగెత్తి వచ్చి అడ్డుపడింది. దాంతో అక్కడున్న ఒక వ్యక్తి ఆమెను తీసుకువెళ్లిపోయాడు. అంతే సోమవారం రాత్రి వెళ్లిపోయిన ఆయన కుమార్తె మంగళవారం నగ్నంగా రైలు పట్టాల వద్ద శవమై కనిపించింది.












Click it and Unblock the Notifications