Girl: ఉద్యోగం ఇప్పిస్తామని మైనర్ అమ్మాయి మీద ట్యాక్సీ డ్రైవర్లు ?, సీసీటీవీ కెమెరాల్లో చిక్కిన కామాంధులు!
ముంబాయి: బాలిక మీద ఆమె కుటుంబ సభ్యులే లైంగిక దాడికి పాల్పడటంతో ఆమె తప్పించుకుని ఓ ఆశ్రమంలో తలదాచుకుంది. ఉద్యోగం సంపాధించాలని ఆశతో ఆమె ఆశ్రమం నుంచి బయటకు వెళ్లింది. రైల్వేస్టేషన్ లో రైలు కోసం వేచి చూస్తున్న బాలికను ట్యాక్సీ డ్రైవర్లు పరిచయం చేసుకున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బాలికను లాడ్జ్ లోకి పిలుచుకుని వెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఆ అమ్మాయిని అదే రైల్వేస్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు ఓ కామాంధుడిని అదుపులోకి తీసుకున్నారు.

ఫ్యామిలీ కన్నుపడింది
ముంబాయిలో 15 ఏళ్ల అమ్మాయి నివాసం ఉంటున్నది. 16 ఏళ్లలో పడటానికి ఆమెకు ఇంకా నెల రోజులు తక్కువ ఉంది, కుటుంబ సభ్యులు లైంగిక వేధింపులకు పాల్పడటంతో ఆ మైనర్ అమ్మాయి గత జులై నెలలో ఇంటి నుంచి పారిపోయి ముంబాయిలోని ఓ ఆశ్రమంలో తలదాచుకుంది.

ఉద్యోగం చెయ్యాలని వెళ్లింది
ఉద్యోగం సంపాధించాలని ఆశతో మైనర్ అమ్మాయి ఈనెల 21వ తేదీన ఆశ్రమం నుంచి బయటకు వెళ్లింది. ముంబాయిలోని చత్రపతి శివాజీ రైల్వేస్టేషన్ లోని ఫ్లాట్ ఫామ్ నెంబర్ 8లో రైలు కోసం వేచి చూస్తున్న బాలిక వేచి చూస్తోంది. ఆ సందర్బంలో రైల్వేస్టేషన్ లో ఉన్న ఇద్దరు ట్యాక్సీ డ్రైవర్లు ఆ మైనర్ అమ్మాయిని పరిచయం చేసుకున్నారు.

లాడ్జ్ లో అత్యాచారం చేసి?
ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి బాలికను రైల్వేస్టేషన్ సమీపంలోని లాడ్జ్ లోకి పిలుచుకుని వెళ్లిన కామాంధులు ఆమె మీద సామూహిక అత్యాచారం చేశారు. మరుసటి రోజు వరకు బాలికను అదే లాడ్జ్ లో అత్యాచారం చేశారు. మరుసటి రోజు ఆ అమ్మాయిని అదే రైల్వేస్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయారు.

సీసీటీవీ కెమెరాల్లో నిందితులు
బాలిక మళ్లీ ఆశ్రమానికి వెళ్లి అక్కడి పెద్దలకు అసలు విషయం చెప్పింది. బాలిక ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసి రైల్వేస్టేషన్ లోని సీసీటీవీ కెమెరాలు పరిశీలించారు. బాలికను పిలుచుకుని వెళ్లిన 28 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్ ను అరెస్టు చేశామని, మరో కామాంధుడి కోసం గాలిస్తున్నామని ఇన్స్ పెక్టర్ రాజేష్ పవార్ స్థానిక మీడియాకు చెప్పారు.












Click it and Unblock the Notifications