Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Girlfriend: భర్త లేడు, ఇద్దరు బాయ్ ఫ్రెండ్స్, మిడ్ నైట్ ఒకరు హత్య, ఒకడు ?, ప్రియురాలు ?

చెన్నై/ కడలూరు: ఇద్దరు యువకులు చాలాకాలంగా స్నేహితులు. ఇద్దరు డ్రైవర్లు కావడంతో నిత్యం కలుస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అయిన యువకుల మద్య ఇటీవల గొడవలు మొదలైనాయి. సాటి స్నేహితులు ఇప్పటికే ఇద్దరి మద్య రాజీలు చేశారు. రాత్రి స్నేహితులు నిర్జనప్రదేశంలో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. ఆ సందర్బంలో ఓ యువకుడు హత్యకు గురైనాడు. యువకుడి హత్యతో అతని బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. యువకుడి హత్య కేసులో ప్రధాన నిందితుడితో పాటు కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఇదే యువకుడి హత్యకు కేసుతో లింక్ ఉన్న ఓ మహిళ విషం తాగేసి బస్ స్టాండ్ లో కుప్పకూలిపోవడంతో అసలు మ్యాటర్ బయటకు వచ్చింది..

 చిన్నప్పటి ఫ్రెండ్స్

చిన్నప్పటి ఫ్రెండ్స్

తమిళనాడులోని కడలూరు జిల్లాలోని పన్రూటిలోని తట్టంజవాడిలోని గాంధీనగర్ లో శక్తివేల్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. పన్రూటిలో సుమన్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. సుమన్, శక్తివేల్ ఇద్దరూ చాలాకాలంగా స్నేహితులు. శక్తివేల్, సుమన్ ఇద్దరూ ఆటో డ్రైవర్లు కావడంతో నిత్యం కలుస్తున్నారు.

 నిర్జనప్రదేశంలో లిక్కర్ పార్టీ

నిర్జనప్రదేశంలో లిక్కర్ పార్టీ

చాలా సంవత్సరాల నుంచి స్నేహితులు అయిన శక్తివేల్, సుమన్ ల మద్య గత ఏడాది నుంచి గొడవలు మొదలైనాయి. సాటి స్నేహితులు ఇప్పటికే ఇద్దరి మద్య రాజీలు చేశారు. రాత్రి సుమన్ అతని స్నేహితులు కలిసి తట్టంజవాడిలోని అగ్నిమాపక శాఖ కార్యాయలం వెనుక వైపు ఉన్న నిర్జనప్రదేశంలో లిక్కర్ పార్టీ చేసుకున్నారు. లిక్కర్ పార్టీకి శక్తివేల్ ను పిలిపించారు.

 యువకుడి హత్యతో కలకలం

యువకుడి హత్యతో కలకలం

లిక్కర్ పార్టీ జరిగే సమయంలోనే సుమన్ అతని స్నేహితుడు శక్తివేల్ తో గొడవపడ్డాడు. ఆ సందర్బంలో మాటామాటా పెరిగిపోయింది. నువ్వు భూమికను వదిలేయాలని శక్తివేల్ అతని ఫ్రెండ్ సుమన్ కు వార్నింగ్ ఇచ్చాడు, నువ్వే భూమికను వదిలేయాలని సుమన్ అడ్డం తిరిగాడు. ఆ సందర్బంలో రెచ్చిపోయిన సుమన్ అతని స్నేహితులు శక్తివేల్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు.

 వెలుగులోకి షాకింగ్ సమాచారం

వెలుగులోకి షాకింగ్ సమాచారం

శక్తివేల్ హత్యతో అతని బంధువులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హంతకులను అరెస్టు చేస్తామని కడలూరు జిల్లా ఎస్పీ ఆందోళనకారులకు హామీ ఇచ్చారు. శక్తివేల్ హత్య కేసులో ప్రధాన నిందితుడు సుమన్ తో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇంకా కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 భూమిక ఎక్కడ ?

భూమిక ఎక్కడ ?

ఈ కేసు విచారణ సమయంలో భూమిక అనే మహిళ పేరు తెరమీదకు వచ్చింది. భూమిక కోసం పోలీసులు గాలించారు. శక్తివేల్ నివాసం ఉంటున్న ఏరియాలోనే భూమిక నివాసం ఉంటున్నది. వివాహం చేసుకున్న తరువాత భర్త చనిపోవడంతో భూమిక ఆమె పుట్టింటికి చేరుకుని అక్కడే నివాసం ఉంటున్నది. ఇదే సందర్బంలో శక్తివేల్ తో భూమిక అక్రమ సంబంధం పెట్టుకుని అతనితో తిరిగింది.

 లవర్ ఫ్రెండ్ ను వదల్లేదు

లవర్ ఫ్రెండ్ ను వదల్లేదు

ప్రియుడు శక్తివేల్ స్నేహితుడు సుమన్ ను కూడావలలో వేసుకున్న భూమిక ఒకరికి తెలీకుండా ఒకరితో తిరిగింది. ఈ విషయం బయటపడటంతో శక్తివేల్, సుమన్ గొడవలుపడి శత్రువులు అయ్యారని పోలీసులు అన్నారు. ఇదే సమయంలో పోలీసులు తన కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న భూమిక తప్పించుకుని ఆ ప్రాంతం నుంచి పారిపోయింది.

 విషం తాగేసిన ఇద్దరు ప్రియుల ముద్దుల ప్రియురాలు

విషం తాగేసిన ఇద్దరు ప్రియుల ముద్దుల ప్రియురాలు

విషం తాగేసిన భూమిక విల్లుపురంలోని బస్ స్టాండ్ దగ్గరకు వెళ్లి అక్కడ కుప్పకూలిపోయింది. ప్రయాణికులు భూమికను ఆసుపత్రికి తరలించారు. భర్త చనిపోవడం, ఒక ప్రియుడు హత్యకు గురికావడం, మరో ప్రియుడు అరెస్టు కావడంతో హడలిపోయిన భూమిక ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని పోలీసులు అన్నారు. శక్తివేల్, సుమన్ ను తన చుట్టూ తిప్పుకుని జల్సా చేసిన భూమిక ఒకరు హత్యకు గురికావడానికి కారణం అయ్యిందని వెలుగు చూడటం కడూలురులో కలకలం రేపింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+