Girlfriend: ప్రియురాలి పెళ్లి డేట్ ఫిక్స్, నడిరోడ్డులో బట్టలు చింపేసి ఐదుసార్లు కాల్చి చంపేశాడు !
లక్నో/ బరేలి: చిన్నప్పటి కలిసి చదువుకుంటున్న యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఏకాంతంగా ఇంతకాలం తిరిగారు. చాలాకాలం నుంచి ప్రేమికులు కలిసి తిరుగుతున్న విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. రానురాను యువతి ఆమె ప్రియుడికి దూరం అవుతూ వచ్చింది. తరువాత యువతికి వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. యువతి ఆమె సోదరుడితో కలిసి షాపింగ్ కు వెళ్లి కావలసిన వస్తువులు అన్ని తీసుకుని ఇంటికి బయలుదేరింది. మార్గం మద్యలో ప్రియుడు ఆమెను అడ్డగించాడు. ప్రియురాలిని, ఆమె అన్నను కిందకు తోసేసి ఆమె బట్టలు మొత్తం చింపేసి పాయింట్ బ్లాక్ రేంజ్ లో ఆమెను స్పాట్ లో కాల్చి చంపేయడం కలకలం రేపింది. యువతిని కాపాడటానికి ఆమె సోదరుడు అనేక ప్రయత్నాలు చేసి విఫలం అయ్యాడు. ప్రియురాలిని రివాల్వర్ తో కాల్చి చంపేసిన ప్రియుడు ఊరంతా తిరిగేసి తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి బుద్దిగా రివాల్వర్ పోలీసులకు ఇచ్చేసి లొంగిపోయాడు.

ప్రేమికులు
ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో రజనీష్ అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకుంటున్న 19 ఏళ్ల వయసు ఉన్న స్వప్నా (పేరు మార్చడం జరిగింది) అనే యువతి, రజనీష్ ప్రేమించుకున్నారు. రజనీష్, స్వప్నా ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఏకాంతంగా ఇంతకాలం తిరిగారు.

పెళ్లికి నో చెప్పిన అమ్మాయి కుటుంబ సభ్యులు
చాలాకాలం నుంచి ప్రేమికులు రజనీష్, స్వప్నా కలిసి తిరుగుతున్న విషయం ఇరు కుటుంబ సభ్యులకు తెలిసింది. రజనీష్ ను వివాహం చేసుకోవడం మాకు ఇష్టం లేదని, అతన్ని నువ్వు పెళ్లి చేసుకుంటే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని స్వప్నాను ఆమె కుటుంబ సభ్యులు బెదిరించారని సమాచారం. రానురాను స్వప్నా ఆమె ప్రియుడు రజనీష్ కు దూరం అవుతూ వచ్చింది.

అమ్మాయి పెళ్లికి ఏర్పాట్లు పూర్తి
కొంతకాలం క్రితం రజనీష్ ప్రియురాలు స్వప్నాకు వేరే యువకుడితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే స్వప్నా పెళ్లి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. స్వప్నా కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లకు పెళ్లి పత్రికలు పంచేశారు. స్వప్నా ఆమె సోదరుడితో కలిసి ఫతేగంజ్ ఈస్ట్ ఏరియాలోకి వెళ్లి షాపింగ్ కు వెళ్లి కావలసిన వస్తువులు అన్ని తీసుకుని బైక్ లో ఇంటికి బయలుదేరారు.

నడిరోడ్డులో కాల్చి చంపేసిన ప్రియుడు
బైక్ లో సోదరుడితో కలిసి వెలుతున్న స్వప్నా బైక్ ను రజనీష్ మరో బైక్ తో ఢీకొట్టాడు. ఆ సమయంలో స్వప్నా, ఆమె సోదరుడు రోడ్డు పక్కన పడిపోయారు. ఆ సమయంలో ఆవేశంతో ఊగిపోయిన రజనీష్ అతని ప్రియురాలు స్వప్నా జుట్టుపట్టుకుని నడిరోడ్డులో కొద్దిదూరం ఈడ్చుకుని వెళ్లాడు. తరువాత స్వప్నా బట్టలు చింపేశాడు. సోదరి స్వప్నాను కాపాడటానికి ఆమె సోదరుడు ప్రయత్నించడంతో అతన్ని పట్టుకున్న రజనీష్ చితకబాదేశాడు. తరువాత రివాల్వర్ తీసిన రజనీష్ స్వప్నాను పాయింట్ బ్లాక్ రేజ్ లో 5 రౌండ్లు కాల్పులు జరిపాడు. స్వప్నా నుదిటి మీద, ఛాతీ, కడుపులో బుల్లెట్లు దూసుకోవడంతో ఆమె ప్రాణాలు స్పాట్ లో కలిసిపోయాయి.
Recommended Video

అందుకే కాల్చి చంపేశాను
తరువాత స్వప్నా సోదరుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రియురాలు స్వప్నాను రివాల్వర్ తో కాల్చి చంపేసిన ప్రియుడు ఊరంతా తిరిగేసి తరువాత పోలీస్ స్టేషన్ కు వెళ్లి బుద్దిగా రివాల్వర్ పోలీసులకు ఇచ్చేసి లొంగిపోయాడని బరేలీ ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ స్థానిక మీడియాకు చెప్పారు. తనను మోసం చేసి వేరే పెళ్లి చేసుకుంటున్నదని కోపంతోనే ఆమెను కాల్చి చంపేశానని రజనీష్ నేరం అంగీకరించాడని బరేలి ఎస్పీ రోహిత్ సింగ్ సజ్వాన్ మీడియాకు












Click it and Unblock the Notifications