ఎక్కడ?: పోకిరీలను చీల్చి చెండాడిన అమ్మాయిలు

Subscribe to Oneindia Telugu

కోల్‌కతా‌: ఆ ఆకతాయిల నుంచి రోజూ వేధింపులు ఎదుర్కొంటున్నారు అక్కడి మహిళలు, అమ్మాయిలు, బాలికలు కూడా. వారిని అడ్డుకునే వారు లేకపోవడంతో మరింత రెచ్చిపోయారు. రోజటిలాగే ఆకతాయిలు కొందరు అమ్మాయిలను మంగళవారం కూడా వేధించారు పోకిరీలు.

ఆ ముగ్గురు అమ్మాయిలు మాత్రం వారికి తిరగబడ్డారు. దీంతో అమ్మాయిలపై బెదిరింపులకు పాల్పడ్డారు పోకిరీలు. అయితే, అమ్మాయిలకు మద్దతుగా స్థానిక మహిళలు రంగంలోకి దిగి పోకిరీలను చితక్కొట్టారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్‌లోని కోల్‌కతాలో చోటు చేసుకుంది.

జగదల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నలుగురు నిందితులు కాకినార రథ్లాల ప్రాంతంలో ఉంటూ ఓ ప్రైవేట్ ఆయుర్వేదిక్ కళాశాలలో చదువుతున్నారు. అయితే, ఈ నలుగురు తరచూ స్థానికంగా ఉన్న మహిళలు, అమ్మాయిలు, పాఠశాల విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు.

Girls beat up harassers, drag them to cops

రోజటిలానే మంగళవారం కూడా ముగ్గురు అమ్మాయిలను వేధించడం మొదలుపెట్టారు నిందితులు. అయితే ఆ ముగ్గురు అమ్మాయిలు వారికి ఎదురుతిరిగారు. దీంతో ఆకతాయిలు అమ్మాయిలను బెదిరింపులకు దిగారు.

కాగా, వేధింపులను గమనించిన స్థానిక మహిళలు ఒక్కసారిగా పదుల సంఖ్యలో వచ్చి ఆకతాయిలపై విరుచుకుపడ్డారు. ఆకతాయిలను పట్టుకుని చితకబాదారు. మరోసారి ఏ అమ్మాయిని వేధించకుండా గట్టి బుద్ధి చెప్పారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకుని, వేధింపుల కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Harassed for months, a group of schoolgirls and women fought back and dragged four of their tormentors to Jagaddal police station on Tuesday. The accused are students of a private Ayurvedic college and hospital.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X