కరువు: పెళ్లి చేసుకోవొద్దని యువతుల నిర్ణయం

బీడ్: మహారాష్ట్రలో మరాఠ్వాడ ప్రాంతంలోని యువతులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది పెళ్లిళ్లు చేసుకోరాదని బీడ్ జిల్లాలోని మాజల్ గావ్ ప్రాంతానికి 25మంది యువతులు నిర్ణయించుకున్నారు. కరువుతో తమ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారడంతో వారు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.

తమకు పెళ్లిళ్లు చేయలేక తమ తల్లిదండ్రులు విపరీత నిర్ణయాలు ఏమైనా తీసుకుంటారనే భయంతో వివాహం చేసుకోరాదని నిశ్చయించుకున్నట్లు యువతులు తెలిపారు. తమ గ్రామంలో 20నుంచి 25 మంది అమ్మాయిలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని సరిత అనే యువతి వెల్లడించింది.

Girls decide not to marry in drought-hit Maharashtra village

ప్రభుత్వ సాయం కోరుకుంటున్నామని తెలిపింది. రెండుమూడేళ్ల నుంచి కరువు తీవ్రంగా ఉందని సవిత అనే మరో యువతి తెలిపింది. తమ తల్లిదండ్రులు ఏడాదంతా కష్టపడితే రూ. 30 వేలు వస్తాయని, ఈ డబ్బు తమ అవసరాలకే సరిపోవడం లేదని... ఇక పెళ్లిళ్లు ఎలా చేస్తారని వాపోయింది.

మరాఠ్వాడ ప్రాంతంలోని లాటూర్, ఉస్మానాబాద్, బీడ్ జిల్లాల్లో కరువు పరిస్థితులు దారుణంగా మారడంతో రైతులు కర్ణాటకతో పాటు ఇతర ప్రాంతాలకు పనుల కోసం వలస వెళ్లిపోతున్నారు. కాగా, తీవ్ర కరువుతో జనవరి 1 నుంచి ఇప్పటివరకు మరట్వాడా ప్రాంతంలో 124 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+