Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

teacher: ఇంగ్లీష్ టీచర్ గలీజు పనులు, 10వ తరగతి అమ్మాయిలు టార్గెట్, స్కూల్లో గోడదూకి పరుగో పరుగు !

అమ్మాయిలతో ఇంగ్లీష్ టీచర్ గలీజు పనులు చేస్తున్నాడని వెలుగు చూసింది. విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ దగ్గరకు వెళ్లడంతో క్లాస్ రూమ్ లో ఉన్న ఇంగ్లీష్ టీచర్ స్కూల్ గోడదూకి ఎస్కేప్ అయ్యాడు.

చెన్నై/ మధురై: ప్రైవేట్ స్కూల్స్ లో చదివించే స్థోమతలేని తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో చదువుకుంటున్న అమ్మాయిలు, అబ్బాయిలు బాగా కష్టపడి చదివి పాస్ అయ్యి ఉన్నత చదువులు చదవాలని, మంచి ఉద్యోగాలు చెయ్యాలని ఆశపడుతున్నారు. ప్రభుత్వాలు లక్షలకు లక్షలు టీచర్లకు జీతాలు ఇస్తున్నాయి. అయితే పిల్లలకు పాఠాలు చెప్పకుండా వారితో రొమాన్స్ చెయ్యడానికి కొందరు టీచర్లు ప్రయత్నించడం కలకలం రేపింది. కొంతకాలంగా అమ్మాయిలతో ఇంగ్లీష్ టీచర్ గలీజు పనులు చేస్తున్నాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. విషయం తెలుసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యులు స్కూల్ దగ్గరకు వెళ్లడంతో క్లాస్ రూమ్ లో పిల్లలకు పాఠాలు చెబుతున్న ఇంగ్లీష్ టీచర్ గోడదూకి ఎస్కేప్ అయ్యాడు.

ఆ స్కూల్ లో 250 మంది విధ్యార్థులు

ఆ స్కూల్ లో 250 మంది విధ్యార్థులు

తమిళనాడులోని పెరంబూరు జిల్లాలో 10వ తరగతి చదువుతున్న బాలికలను లైగింకంగా వేధించిన ప్రభుత్వ పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి గొడవ చెయ్యడం కలకలం రేగింది. పెరంబలూరు జిల్లా గుణ్ణం సమీపంలో పెరియమ్మపాళయం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకు సుమారు 250 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.

శాడిస్టు సెల్వకుమార్

శాడిస్టు సెల్వకుమార్

ఈ పాఠశాలలో ఇంగ్లీషు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సెల్వకుమార్ కొన్నేళ్ల క్రితం నుంచి విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించాడనే ఆరోపణలు రావడంతో విద్యాశాఖ అధికారులు, గ్రామస్తులు మందలించి ఇప్పటికే అతన్ని సీరియస్ గా హెచ్చరించారు. ఇప్పుడు మళ్లీ అమ్మాయిలతో ఇంగ్లిష్ టీచర్ సెల్వకుమార్‌ అసభ్యంగా ప్రవర్తించి కొందర మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులు రావడం హాట్ టాపిక్ అయ్యింది. గత నెల రోజులుగా విద్యార్థినులను స్కూల్ నుంచి బయటికి తీసుకెళ్లి పెరంబలూరులోని అతని ఇంటికి తీసుకెళ్లిన టీచర్ సెల్వకుమార్ వారిని లైగింకంగా వేధిస్తున్నాడని వెలుగు చూసింది.

గోడదూకి పరారైన టీచర్

గోడదూకి పరారైన టీచర్

పాఠశాల తరగతి గదిలో చదువుతున్న తమను లైంగికంగా వేధించారని విద్యార్థులు ఆరోపించారు. విద్యార్థినుల ఫిర్యాదుపై జిల్లా చైల్డ్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ అధికారులకు అమ్మాయిల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు విచారణ ప్రారంభించారు. మంగళవారం ఉదయం పాఠశాలకు వెళ్లిన ఉపాధ్యాయుడు సెల్వకుమార్ అదే రోజు మధ్యాహ్నం అమ్మాయిల తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో స్కూల్ దగ్గరకు వస్తున్నారని తెలుసుకుని హెడ్ మాస్టర్ కు కూడా చెప్పకుండా గోడ దూకి అదృశ్యం అయ్యాడు.

గాలికి వదిలేశారా ?

గాలికి వదిలేశారా ?

దీంతో ఆగ్రహించిన విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలను ముట్టడించి ఇతర ఉపాధ్యాయులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఇంగ్లీష్ టీచర్ సెల్వకుమార్ మీద విచారణ జరిపి అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని అమ్మాయిల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సెల్వకుమార్‌పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరగా విచారణలో నిజానిజాలు తేలితే సంబంధిత ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకుంటామని జిల్లా విద్యాశాఖా అధికారి విద్యార్థుల కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.

కామాంధుడు ఎక్కడ ఉన్నాడు ?

కామాంధుడు ఎక్కడ ఉన్నాడు ?

ఈ నేపథ్యంలో పెరంబలూరులోని మహిళా పోలీస్ స్టేషన్ పోలీసులు టీచర్ సెల్వకుమార్ మీద లైంగిక వేధింపుల కేసు, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు సెల్వకుమార్‌ను ఇంతవరకు అరెస్టు చేయకపోవడం గమనార్హం. అతనిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకోవడం లేదని విద్యార్థుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే కేసు నమోదు చేసిన మహిళా పోలీస్ స్టేషన్ సిబ్బంది కామాంధుడు సెల్వకుమార్ కోసం గాలిస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+