వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాముడి గుడికి.... ఇంటికో రూ .11, ఒక ఇటుక ఇవ్వండి.. సీఎం యోగి అధిత్యనాథ్

|
Google Oneindia TeluguNews

రామమందిరం వివాదం ముగిసింది. ఇక మందిరాన్ని కట్టడమే మిగిలింది. అయితే రామమందిర నిర్మాణం అనేది ఒక రాజకీయ నినాదం అయిన విషయం తెలిసిందే.... వివాదం పూర్తి కావడంతో అది సమసిపోయిందని అంతా భావించారు. తీర్పు తర్వాత చాలమంది నేతలు సైతం ఒక సమస్యకు ఫుల్‌స్టాప్ పడిందంటూ వ్యాఖ్యానించారు. కాని అందరు భావించినట్టుగా రామామందిర నిర్మాణం వివాదం సమసిపోయినా... దాని నిర్మాణం మాత్రం రాజకీయ రూపాన్ని కోల్పోలేదు. దీంతో ఇప్పుడు గుడి నిర్మాణం కూడ రాజకీయ ప్రస్తావనగా మారింది.

అయోధ్య వివాదం మొదటి అంకం ముగిసింది. కాని గుడి నిర్మాణమనే రెండవ అంకం ప్రధానంగా మిగిలింది. ఇప్పుడు ఆ రెండవ అంకం కూడ రాజకీయ నినాదంగా మారింది. ప్రస్తుతం జరగుతున్న ఝార్ఖండ్ ఎన్నికల్లో మళ్లి గుడి నిర్మాణం రాజకీయ నినాదంగా మారింది. ఎన్నికల ప్రచారంలో పాల్గోన్న యూపీ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ రామ మందిరం నిర్మాణం జరిగేందుకు ప్రతి ఇంటికి 11 రూపాయలతో పాటు ఒక ఇటుక ఇవ్వాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే మందిర నిర్మాణం కోసం గత ప్రభుత్వాలు చేసిన విధానంపై ఆయన ఫైర్ అయ్యారు.

give Rs 11, Stone Each Family For Construction Of Ram Temple : Yogi Adityanath

అనేక ఏళ్లుగా నానుతున్న అయోధ్య వివాదాన్ని మోడీ తన చాకచక్యంతో పరిష్కరించారని , గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐ ఎంల్ పార్టీలు సమస్యను పరిష్కరించలేక పోయాయని ఆయన విమర్శించారు. దీంతో మందిర నిర్మాణం కూడ మరోసారి ఎన్నికల ప్రచారంలోకి రావడం చర్చనీయాంశం అయింది. దీంతో బీజేపీ రానున్న ఎన్నికల్లో కూడ మందిర నిర్మాణం కోసం ప్రజల్లోకి వెళ్లేందుకు పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది.

English summary
Uttar Pradesh Chief Minister Yogi Adityanath sought a contribution of Rs 11 and a stone from each family for construction of grand Ram temple in Ayodhya.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X