వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ జీ సోషల్ మీడియా కాదు ద్వేషాన్ని వదిలేయండి, రాహుల్ గాంధీ ట్వీట్

|
Google Oneindia TeluguNews

ఆదివారం నుంచి సోషల్ మీడియా నుంచి తప్పుకొంటానని ప్రధాని మోడీ చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. సోషల్ మీడియా నుంచి తప్పుకోవడం కాదు.. ద్వేషాన్ని వదులకోవాలని సెటైర్ వేశారు. సోషల్ మీడియా ఖాతాల నుంచి తప్పుకొంటే వచ్చే ఫలితం ఏమీ లేదు.. కానీ ద్వేషం వీడనాడితే మంచి జరుగుతుందని ఉద్దేశంతో రాహుల్ ట్వీట్ చేశారు.

Recommended Video

3 Minutes 10 Headlines | World Wildlife Day 2020 | Modi Social Media Accounts Give Up | Oneindia

మీ ప్రతినిధులు కూడా..

మోడీ ట్వీట్‌పై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తనదైన శైలిలో స్పందించారు. గౌరవనీయలైన మోడీ గారూ..మీ లాగే మీ ప్రతినిధులు కూడా సూచన పాటించాలని కోరుకుంటున్నా.. ప్రతీ సెకను మీ పేరు చెప్పుకునే బెదిరించేవారు ఇలా చేస్తే బాగుంటుందని సూచిస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు.

గుడ్ బై..

గుడ్ బై..

ఆదివారం నుంచి తన ఫేస్‌బుక్, ట్వీట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్, యూ ట్యూబ్ వాడబోమని మోడీ ట్వీట్ చేశారు. సోషల్ మీడియా నుంచి తప్పుకొంటాననే మోడీ ట్వీట్‌కు కూడా నెటిజన్లు బాగానే స్పందిస్తున్నారు. 14 వేల మంది రీ ట్వీట్ చేయగా.. 9 వేల మంది లైక్ చేశారు. ట్వీట్టర్‌లో మోడీకి 53.3 మిలియన్ ఫాలొవర్లు, ఫేస్‌బుక్‌లో 44 మిలియన్ ఫాలొవర్లు ఉన్నారు. ఇన్‌స్ట్రాగ్రామ్‌లో కూడా 30 మిలియన్ మందితో టాప్ ప్లేస్‌లో ఉన్నారు.

మోడీ తర్వాతే..

మోడీ తర్వాతే..


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు 14.9 మంది మిలియన్ల ఫాలొవర్లు ఉండగా.. మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు 24.8 మిలియన్ల ఫాలొవర్లు మాత్రమే ఉండేవారు. ఫేస్‌బుక్‌లో ప్రధాని మోడీ టాప్-2లో ఉన్నారు. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ విషయం తెలియజేశారు. మొదటి స్థానంలో ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ నిలిచారు.

English summary
Rahul Gandhi saying on modi offline of social media.. "give up hatred, not social media accounts".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X