ట్రంప్ 24 గంటలు టైమిస్తే.. మోడీ 5 గంటల్లోనే బంద్..?

భారత్-అమెరికా మధ్య గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా సంబంధాలు క్షీణించాయి. రష్యా చమురు కొంటున్నామన్న కారణంతో అమెరికా మన దేశ ఎగుమతులపై ఏకంగా 50 శాతం సుంకాల్ని అమల్లోకి తెచ్చేసింది. ఇప్పటికే 25 శాతం సుంకాలు అమలవుతుండగా.. ఇవాళ్టి నుంచి మరో 25 శాతం పెనాల్టీ రూపంలో అమల్లోకి వచ్చాయి. దీనిపై దేశవ్యాప్తంగా చర్చించుకుంటున్న వేళ లోక్ సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ మరో బాంబు పేల్చారు.

బీహార్ లో జరుగుతున్న ఓటర్ అధికార్ ర్యాలీలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ ఇవాళ ముజఫరాబాద్ లో జరిగిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇవాళ మాట్లాడుతూ భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు, తాను ఫోన్ చేసి నరేంద్ర మోడీకి చెప్పానని, 24 గంటల్లో మీరు ఏం చేస్తున్నారో అది ఆపేయాలని చెప్పానని అన్నారని గుర్తుచేశారు. అయితే నరేంద్ర మోడీ 24 గంటల్లో కాదు, ఐదు గంటల్లో ప్రతిదీ ఆపివేసారన్నారు.

Given 24 Hours Modi Complied Within 5 Alleged Rahul Gandhi on Trump s Directive

మీడియా నరేంద్ర మోడీ, అంబానీ, అదానీ చేతుల్లో ఉందని, మీడియా తేజస్వి లేదా స్టాలిన్ చేతుల్లో లేదన్నారు. గిరిజనులు, దళితులు లేదా వెనుకబడిన తరగతులది కాదన్నారరు. అదానీ, అంబానీ, టాటా, బిర్లాలో, ఎవరు దళితుడో, గిరిజనుడో లేదా వెనుకబడినవారో చెప్పాలన్నారు. న్యాయవ్యవస్థను కూడా చూస్తే... గిరిజనులు, దళితులు లేదా వెనుకబడినవారు లేరన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల యజమానుల జాబితాను ఇస్తే.. అక్కడ కూడా ఒక్క దళితుడు కూడా కనిపించరన్నారు.

Given 24 Hours Modi Complied Within 5 Alleged Rahul Gandhi on Trump s Directive

90 శాతం మందిని ఓటర్లుగా చేర్చలేదని, వారి ఓట్లను దొంగిలించారని రాహుల్ ఆరోపించారు. ఎందుకంటే మీ గొంతు వినిపించే రోజు భారతదేశం పూర్తిగా మారుతుందని వారికి తెలుసన్నారు. అందుకే భారతదేశంలో కుల జనాభా గణన జరుగుతుందని , నిజం బయటకు వస్తుందని తాను నరేంద్ర మోడీకి ఎప్పుడో చెప్పానని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+