Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాంగ్రెస్ అంటే రావణాసురుడి లెక్క, ఒక చేత్తో ఇచ్చి 10 చేతులతో లూటీ, తెలంగాణలో ఇక అంతే?

బెంగళూరు/హైదరాబాద్: కర్ణాటకను ఏటీఎంలా తయారు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కర్ణాటక మొత్తాన్ని దోచుకుంటున్నదని మాజీ సీఎం, జేడీఎస్ నేత హెచ్ డీ కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులను కూడా లూటీ చేస్తోంది, ఒంటి చేత్తో ఇచ్చినట్లే ఇచ్చి పది చేతుల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం లాక్కొంటున్నదని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పాపాలు పండిపోయే రోజులు త్వరలోనే ఉన్నాయని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి మండిపడ్డారు. వరుసగా ట్వీట్లు చేసిన కుమారస్వామి ఉచిత హామీల ద్వారా దీపావళి నాటికి రాష్ట్రాన్ని దివాళా తీసే పరిస్థితిలోకి నెట్టివేసిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కూడా పక్షపాత ధోరణి ప్రదర్శించిందని, కరువు, కరెంటు కష్టాలతో అల్లాడుతున్న అన్నదాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం ద్రోహం చేస్తోందని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

Giving free promises with one hand, Congress government is robbing people with ten hands, says HD Kumaraswamy

కర్ణాటక రాష్ట్రంలో ఉచిత హామీల ప్రమోషన్లకు ఖర్చు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధికి మాత్రం ఖాళీ చేతులు చూపిస్తోందని, కర్ణాటకలో అలాంటి పరిస్థితి దాపురించిందని, కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం రైతులకు ఇచ్చే సబ్సిడీని కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించిందని, సిద్దరామయ్య ప్రభుత్వం ఆదేశాలు చూసి తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

ఇప్పటి వరకు కొత్త కరెంటు కనెక్షన్ పొందుతున్న అన్నదాతలకు ప్రభుత్వం ట్రాన్స్‌ఫార్మర్, విద్యుత్ స్తంభం, అల్యూమినియం వైరు తదితర వాటికి సబ్సిడీ ఇచ్చేదని కుమారస్వామి గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతుల పాదాలు పట్టుకుని ఓట్లు అడుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్న తరువాత అన్నదాతల మెడకు ఉరితాడు బిగించడం ప్రారంభించిందని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు.

ఇంతకంటే దారుణమైన మానసిక స్థితి మరొకటి ఉంటుందా? అని కుమారస్వామి ప్రశ్నించారు. కొత్త విద్యుత్ కనెక్షన్ ల కోసం రూ. 24 వేలు తమ వాటాగా చెల్లించలేక ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇకపై పూర్తి ఖర్చు చెల్లించాలని కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని, కర్ణాటక కసాయిల చేతుల్లో చిక్కుకుపోయిందనడానికి ఇంతకంటే నిదర్శనం కావాలా? అని కుమారస్వామి అన్నారు.

కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీనస్థితిలో ఉన్న ఈ సిద్దరామయ్య ప్రభుత్వం ఇలాంటి దేశద్రోహ చర్యలకు పూనుకుందని, వెంటనే ఈ ఉత్తర్వులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని, రైతులకు మునుపటిలా సబ్సిడీ ఇవ్వాలని, ఉత్తర్వులను ఉపసంహరించుకోకుంటే జేడీఎస్ పార్టీ ఇంటా, బయటా పోరాటం చేస్తుందని మాజీ సీఎం కుమారస్వామి హెచ్చరించారు. తెలంగాణతో సహ ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తి అయిన తరువాత కర్ణాటకలో ఉచిత హామీలు అన్ని అటక ఎక్కుతాయని బీజేపీ కూడా పదేపదే ఆరోపిస్తున్నది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+