వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Prestige: పణజి కింగ్ మేకర్ ఎవరు ?, మోదీ హవానా, పారికర్ వారసత్వమా ?, చావు బతుకుల సమస్య !

|
Google Oneindia TeluguNews

గోవా/ న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కావడంతో ఆ ఐదు రాష్ట్రాల్లో అధికారంలోకి ఎవరు వస్తారా ? అనే ఉత్కంఠ మొదలైయ్యింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. ఐదు రాష్ట్రాల్లో మేమే అధికారంలోకి వస్తామని బీజేపీ, కాంగ్రెస్ తో పాటు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఓటరు మహానుభావులు ఎవరిని కరుణించారు, ఎవరు విజయం సాధిస్తారు అనే విషయం ఈనెల 10వ తేదీన వెలుగు చూడనుంది.

అయితే శనివారం రాత్రి ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. 2017లో గోవా శాసన సభ ఎన్నికల్లో మెజారిటీ ఎమ్మెల్యేలను గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేసి ఐదు సంవత్సరాలు అధికారానికి దూరం అయ్యింది. అయితే ఇప్పుడు గోవాలో బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు చెందిన ఎంతమంది ఎమ్మెల్యేలు విజయం సాధిస్తారు, గోవా ఓటర్లు ఎవరిని కరుణించారు అంటూ ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. గోవాలో 40 నియోజక వర్గాల్లో 39 శాసన సభ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పణజి శాసన సభ నియోజక వర్గం ఒక ఎత్తుగా మారింది. మార్చి 10వ తేదీన పణజి రారాజు ఎవరు అనే విషయం తేలిపోనుంది. మోదీ హవాతో పణజిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తారా ?, గోవా మాజీ సీఎం మనోహర్ పారికర్ వారసుడిగా ఆయన కుమారుడు ఉత్పల్ పారికర్ హీరో అవుతాడా ? అనే విషయం వేచి చూడాలి.

Illegal affair: తల్లితో కలిసి మాజీ లవర్ ను లేపేసింది, మిడ్ నైట్ స్కెచ్, మ్యాటర్ భర్తకు తెలిస్తే !Illegal affair: తల్లితో కలిసి మాజీ లవర్ ను లేపేసింది, మిడ్ నైట్ స్కెచ్, మ్యాటర్ భర్తకు తెలిస్తే !

 గోవాలో 40 అసెంబ్లీ నియోజక వర్గాలు

గోవాలో 40 అసెంబ్లీ నియోజక వర్గాలు

గోవాలో మొత్తం 40 అసెంబ్లీ శాసన సభ నియోజక వర్గాలు ఉన్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్ పార్టీ జీఎఫ్ పీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. అమ్ ఆద్మీ పార్టీ కొందరు స్వతంత్ర పార్టీ అభ్యర్థులతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది, ఇక మమతా బెనర్జీ టీఎంసీ పార్టీ ఎంజీపీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. శివసేన ఎన్ సీపీ పొత్తు పెట్టుకుని గోవా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి.

 పణజి హాట్ టాపిక్

పణజి హాట్ టాపిక్

గోవాలోని పణజి శాసన సభ నియోజక వర్గం బీజేపీకి ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది. గతంలో పణజి నియోజక వర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యే అయిన మనోహర్ పారికర్ గోవాకు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. అయితే మనోహర్ పారికర్ ఆకస్మికంగా మరణించడంతో 2019లో పణజిలో ఎన్నికలు జరిగాయి.

 మోసం చేసిన బీజేపీ

మోసం చేసిన బీజేపీ

ఆ సమయంలో మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కు సీటు ఇవ్వలేదు. పణజిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకున్న బీజేపీ నాయకులు తరువాత ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇటీవల జరిగిన ఎన్నికల్లో రూడా మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ కు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వలేదు.

 బీజేపీకి చావు బతుకుల సమస్య వచ్చింది ఈ నియోజక వర్గంలోనే

బీజేపీకి చావు బతుకుల సమస్య వచ్చింది ఈ నియోజక వర్గంలోనే

తన తండ్రి బీజేపీకి ఎంతో చేశారని, తనకే అన్యాయం జరిగిందని రగిలిపోయిన మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ పణజి నియోజక వర్గంలో ఆప్ మద్దతుతో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. పణజిలో బీజేపీ అభ్యర్థి, మనోహర్ పారికర్ కుమారుడి మద్య అసలు పోటీ ఉంది. ఇక్కడ ఎలాగైనా విజయం సాధించాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు.

Recommended Video

Goa Elections 2022: BJP, Congress వ్యూహాలు TMC, AAP గట్టిపోటీ | Oneindia Telugu
 పణజి రారాజు ఎవరు ?

పణజి రారాజు ఎవరు ?

తన తండ్రి ఆశీస్సులు తనకు ఉన్నాయని, నేనే విజయం సాధిస్తానని మనోహర్ పారికర్ కుమారుడు ఉత్పల్ పారికర్ అంటున్నారు. మొత్తం మీద గోవాలో 39 శాసన సభ ఎన్నికల ఫలితాలు ఒక ఎత్తు అయితే పణజి శాసన సభ నియోజక వర్గం ఒక ఎత్తుగా మారింది. మార్చి 10వ తేదీన పణజి రారాజు ఎవరు అనే విషయం తేలిపోనుంది.

English summary
Goa Assembly Elections 2022: Now Atanasio Monserrate has joined the BJP and denied ticket to Manohar Parrikar's son Utpal Parrikar from Panaji who decided to leave the party and fight as independent. They are locked in contest with AAP's Valmiki Naik, INC's Elvis Gomes and RGP's Rajesh Redkar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X