వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోవా: భాషా రాజకీయాలు, అవి కూడా..

భాషా గుర్తింపుకోసం జరిగిన ఆందోళన తిరిగి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. తమిళనాట జాతీయ భాషగా ‘హిందీ’ అమలుపై ఉధ్రుత దాడులు జరిగాయి.

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

పనాజీ: భాష కూడా జాతి గుర్తింపునకు నిదర్శనమే. ఫ్రెంచ్ భాష ఫ్రెంచ్ జాతికి నిదర్శనం. ప్రతి భాష కూడా ఆ జాతికి గుర్తింపునిస్తుందనడంలో సందేహం లేదు. భాషా గుర్తింపుకోసం జరిగిన ఆందోళన తిరిగి బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసింది. తమిళనాట జాతీయ భాషగా 'హిందీ' అమలుపై ఉధ్రుత దాడులు జరిగాయి. భాష విద్యనందించడంతోపాటు రాజకీయాస్త్రంగా మారనున్నది. గోవాలో ఇదే అంశం ప్రధాన చర్చగా మారింది.

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) మాజీ గోవా చీఫ్ సుభాష్ వెలింగ్కర్ ఈ అంశాన్ని లేవనెత్తడంతో బిజెపిలో ముసలం మొదలైంది. బిజెపికి, ఆర్ఎస్ఎస్‌కు మధ్య విభేదాలు తలెత్తాయి. కేవలం భాష మాత్రమే కాదు జాతి గుర్తింపు కూడా ముందుకు వచ్చింది. కొన్ని నెలల ముందు రాష్ట్ర ప్రభుత్వం కొంకణి, మరాఠీ భాషలు మినహా ఇతర భాషల్లో విద్యాబోధన చేసే స్కూళ్లకు రాయితీలు ఇవ్వడం గోవా రాజకీయాల్లో సంచలనం నెలకొల్పింది. ప్రత్యేకించి ఇంగ్లిష్ మీడియం స్కూళ్లకు అనుమతించడం రాజకీయ ప్రచారాస్త్రంగా మారింది.

ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను క్యాథలిక్ చర్చిలు నడుపుతున్నడయోసెస్ స్కూళ్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందని ఓటర్లు భావిస్తున్నారు. కెరీర్ ద్రుష్ట్యా తల్లిదండ్రులు తమ పిల్లల్లో ఇంగ్లిష్ భాషా పరిజ్నానం పెంపుదలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కానీ ఇది భారత దేశ సంస్క్రుతిని ఆరాధించే వారిలో ప్రత్యేకంగా హిందు కార్యకర్తల్లో ఆందోళన కలిగిస్తున్నది. ఇంగ్లిష్ భాషకు ప్రోత్సాహాన్నివ్వడం గుర్తింపుతో రాజీ పడటమేనని అభిప్రాయం వినిపిస్తున్నది. కనీసం ఇంగ్లిష్ స్కూళ్లకు రాయితీలు ఇవ్వకూడదని కోరుతున్నారు.

Goa Election 2017: Language politics looms as a potentially divisive factor

ఇదే అంశం 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా మారింది. గత ఎన్నికల సమయంలో హిందుత్వ కార్యకర్తలు ప్రస్తుత కేంద్రమంత్రి మనోహర్ పారికర్ వాదనతో ఏకీభవించారు. తర్వాత బిజెపి - ఎంజిపి సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. కానీ కేంద్ర మంత్రి మనోహర్ పారికర్ తాను ఇచ్చిన హామీ నిలుపుకోలేదు. తర్వాత ఆయన వారసుడిగా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీకాంత్ పర్సెకర్ కూడా హామీ అమలు చేయలేదు. ఇంగ్లిష్ మాధ్యమాన్ని బోధిస్తున్న డయాసెస్ స్కూళ్లకు రాయితీలు యథాతథంగానే కొనసాగుతుండటం సుభాష్ వెల్లింగ్కర్ వంటి హిందుత్వ అతివాదులు గుర్తుచేయడంతో తిరిగి రాజకీయ అస్త్రంగా మారింది.

బిజెపి నేతలకు కూడా ఈ రాయితీలు కొనసాగించడం ఇష్టం లేదని ఓటర్లు నిర్ణయానికి వచ్చారు. క్రైస్తవ మతంలోకి మార్పిడిల అంశాన్ని ముందుకు తెచ్చినప్పుడే ఈ స్కూళ్లకు రాయితీలు ఉపసంహరిస్తారని భావించినా అలా జరుగలేదు. మత సామరస్యాన్ని ప్రోత్సహించడంలో ప్రభుత్వ అచేతనత్వంపై ప్రజల్లో నిరసన వ్యక్తమవుతున్నది.

వచ్చే నెల వరకూ సస్పెన్స్

హర్యానాలో సీఎం భజన్‌లాల్ ద్వారా వచ్చిన 'ఆయారాం గాయారాం' రాజకీయాలకు పునర్నిర్వించిందీ గోవా. శనివారం ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈవీఎంలలో ఓటర్లు తమ తీర్పు నిక్షిప్తంచేసిన తర్వాత 35 రోజుల పాటు వేచి చూడాల్సి వస్తున్నది. అయితే గత 54 ఏళ్లలో గోవాలో 22 ప్రభుత్వాలు కొలువుదీరాయి. 1961లో పోర్చుగీస్ నుంచి విముక్తి పొందిన తర్వాత ఐదుసార్లు (639 రోజులు) రాష్ట్రపతి పాలన విధించింది. 1998 నుంచి 2012లో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేసే వరకూ పది ప్రభుత్వాలు మారాయి.

సూట్ కేసు రాజకీయాలకు పెన్నిధి

ఎటువంటి బేరసారాలకు తావు లేకుండా బిజెపి స్థిరమైన పాలన అందిస్తున్నది. సూట్ కేస్ రాజకీయాలు అవకాశమే ఇవ్వకుండా వ్యవహరిస్తోంది. 40 స్థానాల అసెంబ్లీకి శనివారం జరిగే పోలింగ్‌లో బిజెపి విజయం సాధిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్రంలో చిన్న చితకా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు గణనీయంగానే ఉన్నాయి. సూట్‌కేస్ రాజకీయాలు చేస్తున్న వారంతా స్వతంత్ర అభ్యర్థులుగా భవిష్యత్ అవకాశాల కోసం బరిలోకి దిగారు. కానీ ఆమ్ఆద్మీ పార్టీ రంగ ప్రవేశం చేయడంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది.

11.09 లక్షల మంది ఓటర్లు గల ఈ చిన్న కోస్తా రాష్ట్రంలో క్రితంసారి 81.73 శాతం మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఫ్యాన్సీ మ్యానిఫెస్టోలు విడుదలచేశాయి. ఉచిత పథకాలతోపాటు ఉపాధి కల్పిస్తామని హామీలు గుప్పించాయి. ఒకవేళ బిజెపి గెలుపొందితే తిరిగి మనోహర్ పారికర్‌ను సిఎంగా తీసుకొస్తామని ఆ పార్టీ సంకేతాలిచ్చింది. ఒక వార్తాపత్రిక సర్వే ప్రకారం బిజెపి అతిపెద్ద పార్టీగా ఏర్పాటు కావచ్చునని, ఆమ్ఆద్మీ పార్టీ చేతిలో ఘోర పరాజయానికి గురైంది.

English summary
If language is seen to betoken identity, it is generally taken to be national identity. The French language, for example, is considered the prime marker of French national identity. The very term linguistic-ethnic identity stems from the idea that language determines ethnicity and, for many, nationality.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X